ఫ్రెండ్ కి కరోనా సోకిందని, ఇతను చేసిన పని చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు.. సీఎం కూడా షాక్..!

ఫ్రెండ్ కి కరోనా సోకిందని, ఇతను చేసిన పని చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు.. సీఎం కూడా షాక్..!

by Anudeep

Ads

కరోనా గడ్డు కాలం వచ్చాక ఒకరినొకరు దగ్గరికెళ్లి కలవడమే మానేసాం. ఏమైనా ఉంటె ఫోన్ లో మాట్లాడుకోవడం తప్ప.. దగ్గరికెళ్లి పలకరించే పరిస్థితులు ప్రస్తుతం లేవు. ఇలాంటి పరిస్థితి లో కూడా ఓ వ్యక్తి తన స్నేహితుడి కోసం ప్రాణాలను పణం గా పెట్టి 24 గంటల్లో 1300 కిలోమీటర్లు ప్రయాణం చేసాడు. ఇంతకీ అతను ఎందుకు అంత దూరం ప్రయాణించాడో చూద్దాం..

Video Advertisement

devendra 1

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్ కు చెందిన రాజన్ అనే వ్యక్తి కరోనా బారిన పడ్డాడు. అతన్ని ఆసుపత్రిలో చేర్పించి ఆక్సిజెన్ సపోర్ట్ తో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే.. అక్కడ కూడా ఆక్సిజెన్ కొరత ఉండడం తో.. 24 గంటలు మాత్రం ఆక్సిజెన్ ను అందిస్తూ ట్రీట్మెంట్ చేయగలుగుతున్నారు. అతని కుటుంబ సభ్యులు అతని స్నేహితుడు అయిన దేవేంద్ర కు విషయం చెప్పారు.

devendra 2

ఎలా అయినా ఫ్రెండ్ ని కాపాడుకోవాలన్న ఉద్దేశం తో.. దేవేంద్ర తన పక్క ఊరు అయిన బొకారో..(150 కి.మీ ) కు వెళ్లి ఆక్సిజెన్ సిలిండెర్ కోసం ప్రయత్నించాడు. ఆ రాత్రంతా ఆక్సిజెన్ కోసం వెతుకుతూనే ఉన్నాడు. చివరకు జార్ఖండ్ గ్యాస్ ప్లాంట్ ఓనర్ రాకేష్ గుప్తా అతని వద్ద రూపాయి కూడా తీసుకోకుండా ఆక్సిజెన్ ను అందచేసాడు.

devendra 3

గ్యాస్ సిలిండెర్ దొరికింది. దీనిని అక్కడనుంచి 1300 వందల కిలోమీటర్ల దూరం లో ఉన్న తన ఫ్రెండ్ వద్దకు తీసుకెళ్లాల్సి ఉంది. ఇంకా లేట్ చేయకుండా.. తెలిసిన వాళ్ళ దగ్గర కార్ తీసుకునే తానె డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు.. దారిలో చాలా చోట్ల పోలీసులు ఆపినప్పటికీ.. అందరికి తన పరిస్థితి వివరిస్తూ ముందుకెళ్లాడు. సమయానికి ఫ్రెండ్ కి ఆక్సిజెన్ ను అందించగలిగాడు.

devendra 4

రాజీవ్ కు, దేవేంద్రకు సంజీవ్ అని మరో స్నేహితుడు ఉండేవాడు. అతను ఇటీవలే గత నెల 19 న ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మరో ఫ్రెండ్ ను పోగొట్టుకోలేక.. దేవేంద్ర ఇంతటి రిస్క్ చేసాడు. అతని ఫ్రెండ్ ను కాపాడుకున్నాడు. అతను చేసిన సాహసానికి యూపీ సీఎం కూడా షాక్ అయ్యారు.

 


End of Article

You may also like