ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ శుక్రవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో టీమ్‌ఇండియా విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. తొలుత సీమ్, స్వింగ్‌తో ఆసీస్ పేసర్లు వణికించడం తో టీమ్‌ఇండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఐదు పరుగుల వద్ద ఓపెనర్ ఇషాన్ కిషన్ ఔట్ అవ్వగా.. ఐదో ఓవర్ లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ వెంట వెంటనే ఔట్ అయ్యారు.
Video Advertisement
ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ కాస్త నిలదొక్కుకుంటున్నట్లు కనిపించగా.. ఆ తర్వాత గిల్ ఔట్ కావడం తో భారత్ కి ఒత్తిడి పెరిగింది. తర్వాత వచ్చిన పాండ్య ని ఔట్ చేసారు. ఇక అప్పుడు ఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తమ అసలైన ఆటతీరును బయటకు తీశారు. ఆఫ్‌సైడ్ స్వింగ్ అవుతున్న బంతుల్ని వదిలేశారు.
చెత్త బంతుల్ని మాత్రమే ఆడారు. జట్టు స్కోరు ని పరుగులు పెట్టించారు. కేఎల్ కొన్ని బౌండరీలు బాదడంతో గెలుపు ఖాయమైంది. జడ్డూ సైతం బాగా ఆడటంతో ఈ జోడీ 123 బంతుల్లో 108 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పింది. 61 బంతులు మిగిలుండగానే 5 వికెట్ల తేడాతో జట్టుని గెలిపించింది.
అంతకు ముందు జరిగిన ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆసీస్‌కు మంచి ఆరంభం లభించలేదు. రెండో ఓవర్లోనే ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను (5: 10 బంతుల్లో, ఒక ఫోర్) మహ్మద్ సిరాజ్ బౌల్డ్ చేశాడు. మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ (81: 65 బంతుల్లో, 10 ఫోర్లు, ఐదు సిక్సర్లు) మాత్రం సూపర్ ఇన్నింగ్స్ ఆడేశాడు. అతడికి స్టీవ్ స్మిత్ (22; 30 బంతుల్లో, నాలుగు ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 63 బంతుల్లో 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మార్ష్ 51 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఆపై ఎడాపెడా బాదేసి స్కోరు వేగం పెంచాడు.
దాంతో 16.4 ఓవర్లకు ఆసీస్ 100 పరుగుల మైలురాయి అధిగమించింది. మొత్తంగా ఒక దశలో 169 పరుగులకు నాలుగు వికెట్లతో కనిపించిన ఆస్ట్రేలియా కేవలం 19 పరుగుల వ్యవధిలోనే ఆరు వికెట్లు కోల్పోయింది. మహ్మద్ షమీ, సిరాజ్ ఆస్ట్రేలియా లోయర్ ఆర్డర్ వెన్ను విరిచారు. దీంతో ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇక ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్, తన భార్య తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేడియంలోని బిగ్ స్క్రీన్ పై రజనీకాంత్ కనిపించినప్పుడల్లా ప్రేక్షకుల కేరింతలతో వాంఖడే స్టేడియం హోరెత్తిపోయింది. అలాగే బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కొద్దిసేపు స్టేడియం లో కనిపించారు.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14