Ads
2023 వన్డే ప్రపంచ కప్ ఆఖరి దశకు వచ్చేసింది. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఎట్టకేలకు భారత్ న్యూజిలాండ్ ను సెమీస్ లో ఓడించి ఫైనల్ కు చేరుకుంది. 150 కోట్ల భారత అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది.అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో భారత్ చాలా తప్పిదాలు చేసింది. చివరికి మ్యాచ్ నెగ్గింది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఆ తప్పిదాల వల్ల తీవ్ర నష్టం జరిగేది.
Video Advertisement
టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్ ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. రోహిత్ శర్మ అయితే తన హిట్టింగ్ తో చెలరేగిపోయాడు. శుభ మాన్ గిల్ కూడా తన వంతు సహకారాన్ని అందించాడు. అయితే రోహిత్ అవుట్ అవ్వడం, గిల్ రిటైర్డ్ హర్ట్ అవ్వడం వల్ల బరిలోకి వచ్చిన కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ లు సెమీఫైనల్ మ్యాచ్ లో తమ విశ్వరూపాన్ని చూపించారు.
కోహ్లీ అయితే ప్రపంచ చరిత్రలో 50 సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ గా చరిత్ర సృష్టించాడు. శ్రేయస్ కూడా వరల్డ్ కప్ లో రెండవ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఇలా దూకుడుగా ఆడిన టీమిండియా న్యూజిలాండ్ బౌలర్లను చిత్తుగా చేస్తూ 398 పరుగులు చేసింది.తర్వాత చేధనకు దిగిన న్యూజిలాండ్ ఆరంభంలోనే తడబాటు పడుతూ రెండు వికెట్లను కోల్పోయింది. తర్వాత న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ లు కెన్ విలియమ్ సన్, మిచెల్ లు క్రిస్ లో పాతుకుపోయారు. ఒక దశలో మ్యాచ్ చేయిజారిపోతుందేమో అనిపించింది. వాళ్లు చెలరేగి ఆడుతుంటే మన ఫీల్డర్లు చాలా తప్పిదాలు చేశారు.క్యాచులు మిస్ చేయడం, ఫోర్లు వదిలేయడం లాంటివి చేశారు. ముందు నుండి బౌలర్ సిరాజ్ పైన ఫీల్డింగ్ విషయంలో విమర్శలు వస్తున్నాయి.
సెమీఫైనల్ మ్యాచ్ లో కూడా సిరాజ్ పేలవ ఫీల్డింగ్ చేశాడు. బౌలింగ్ లో కూడా భారీ పరుగులు సమర్పించుకున్నాడు. చివరిలో ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. షమీ తన అద్భుతమైన స్పెల్ తో ఏడు వికెట్లు తీసి భారత్ కు విజయాన్ని ఖరారు చేశాడు. భారత్ మ్యాచ్ నెగ్గినా కూడా ఫైనల్ లో సెమీఫైనల్ లో చేసిన తప్పులు చేయకుండా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఒక్క చిన్న తప్పు భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తుంది. సిరాజ్ నీ పద్ధతి మార్చుకో అంటూ అభిమానులు కోరుతున్నారు. ఫీల్డింగ్ మీద దృష్టి పెట్టాలని ఫీలింగ్ కోచ్ సిరాజ్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు. ఒక్క అడుగు దూరంలో వరల్డ్ కప్ ఉంది. ఇండియా గెలవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.
Also Read:“షమీకి గుడి కట్టినా తప్పు లేదు..!” అంటూ… వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లో ఇండియా గెలవడంపై 15 మీమ్స్..!
End of Article