మొన్న ఇండియా ని ట్రోల్ చేసాడు నేడు షమీ చేతిలో ఘోరంగా ట్రోల్ అయ్యాడు ! పాక్ బౌలర్ షోయబ్ అక్తర్ కి దిగిపోయింది !

మెల్ బోర్న్ వేదికగా ఆదివారం రోజు టీ t20 ఫైనల్ మ్యాచ్ జరిగింది. లక్ష్యం చిన్నదే అయినా పాక్ జట్టు పోరాడి ఓడిందనే చెప్పాలి. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ పాక్ జట్టుని బాటింగ్ కి ఆహ్వానించాడు. కేవలం 137 స్వల్ప లక్ష్యం ఇంగ్లాండ్ జట్టు ముందు ఉంచింది పాక్ జట్టు. పాక్ జట్టులో బాబర్ ఆజం (32 ), మసూద్ (38 ) రిజ్వాన్ (15 ) పరుగులు మాత్రమే చెయ్యగా.

సామ్ కరణ్ రెండు వికెట్లు తీసి 12 పరుగులు మాత్రమే ఇవ్వగా. అనంతరం బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి లక్షాన్ని ఛేదించగా జట్టు విజయంలో బెన్ స్టోక్స్ కీలక బాధ్యత వహించాడు.

1992 తరువాత మరో సారి కప్ గెలవాలన్న కోరిక నెరవేరకుండానే వెనుతిరిగింది. పాక్ ఓటమిని జీర్ణించుకోలేని పాక్ సీనియర్ బౌలర్ షోయబ్ అక్తర్ ట్విట్టర్ వేదికగా తన స్పందనని తెలియచేసాడు. హార్ట్ బ్రేకింగ్ ఎమోజితో ట్వీట్ చెయ్యగా. దాని మీద టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ షమీ స్పందించాడు “సారీ బ్రదర్ దీన్నే కర్మ” అంటారు అంటూ రిప్లై ఇచ్చాడు. సెమిస్ లో టీం ఇండియా ఓటమి పై వ్యంగంగా పలు ట్వీట్స్ పోస్ట్ చేసాడు.

Also Read:  “మనోళ్ళని ట్రోల్ చేసారు… ఇప్పుడేమైంది?”అంటూ …ఫైనల్ లో ఇంగ్లాండ్ తో పాకిస్తాన్ ఓడిపోడంపై 18 ట్రోల్ల్స్.!