అత్యధిక సార్లు 90’s లో అవుట్ అయిన ఇండియన్ క్రికెటర్లు వీరే.! ఎవరు ఎన్నిసార్లు అవుట్ అయ్యారంటే?

అత్యధిక సార్లు 90’s లో అవుట్ అయిన ఇండియన్ క్రికెటర్లు వీరే.! ఎవరు ఎన్నిసార్లు అవుట్ అయ్యారంటే?

by Anudeep

ఏ క్రీడలో అయినా ఒక ఆటగాడి సామర్ధ్యాన్ని ఎలా పరిగణిస్తాం..? ఫుట్ బాల్ లో అయితే ఎన్ని గోల్స్ చేసాడని, టెన్నిస్ లో అయితే ఎన్ని గ్రాండ్ స్లామ్స్ గెలిచడాని, క్రికెట్ లో అయితే ఎన్ని సెంచరీలు చేసాడని కొలమానంగా చూస్తాం.. ఎంతోసేపు క్రీజ్ లో నిలదొక్కుకుంటే కానీ సెంచరీ చేయడం అంత సులభం కాదు.

Video Advertisement

టీ 20లు వచ్చాక సెంచరీలు తగ్గాయి కానీ అప్పట్లో వన్డే, టెస్టుల్లో సెంచరీలు ఎక్కువగా నమోదు అయ్యేవి. ఆ రోజుకి సెంచరీ చేసాడంటే మ్యాచ్ ఓడిపోయినా అతన్నే హీరోగా చూస్తారు అభిమానులు. ఎందుకంటే సెంచరీకి క్రికెట్ లో అంత ప్రాముఖ్యత ఉంది. అలాంటి సెంచరీని తృటిలో మిస్ అయ్యి 90’s లో ఔట్ అయినా ఇండియన్ ప్లేయర్స్ చాలా మందే ఉన్నారు. అందులో ఎక్కువసార్లు ఎవరు ఔట్ అయ్యారో చూద్దాం..

#1. సచిన్ టెండూల్కర్:


క్రికెట్ గాడ్ పిలుచుకునే సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 27 సార్లు తొంభైల్లో అవుట్ అయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా చూసిన కూడా ఇదే అత్యధికం. సచిన్ స్కోర్ తొంభైల్లో ఉన్నప్పుడు వేగం కూడా తగ్గించి ఆడినప్పటికీ అత్యధికంగా తొంభైల్లో అవుట్ అయ్యాడు. మొత్తానికి సచిన్ 100 సెంచరీలు చేసి క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.

#2. రాహుల్ ద్రావిడ్:


ది గ్రేట్ వాల్ రాహుల్ ద్రావిడ్ ఇండియాకి కెప్టెన్ గా ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. రాహుల్ 12 సార్లు తొంభైల్లో అవుట్ అయ్యి తృటిలో సెచరీని మిస్ అయ్యాడు.

#3. వీరేంద్ర సెహ్వాగ్:


డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వచ్చింది మొదలు బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా బౌలర్లపై విరుచుకు పడుతుంటాడు. వీరు కూడా 10 సార్లు తొంభైల్లో అవుటయ్యి అభిమానులను నిరుత్సాహ పరిచాడు.

#4. శిఖర్ ధావన్:


ప్రస్తుత ఇండియన్ ఓపెనర్ గబ్బర్ గా పిలుచుకునే శిఖర్ ధావన్ కూడా 10 సార్లు తొంభైల్లో అవుటయ్యాడు. ధావన్ ఇంకా క్రికెట్ కెరీర్ కొనసాగిస్తున్నాడు కాబట్టి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.


You may also like