ఇలాంటి తల్లులు కూడా ఉంటారా.? పాపకి ఆరోగ్యం బాలేదని.?

ఇలాంటి తల్లులు కూడా ఉంటారా.? పాపకి ఆరోగ్యం బాలేదని.?

by Mohana Priya

Ads

తల్లి అంటే మన ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. కానీ ఇటీవల అలాంటి ఒక తల్లి మానవత్వం మరిచిపోయి ప్రవర్తించిన ఘటన ప్రస్తుతం చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే, న్యూస్ 18 తెలుగు కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రేమల్లి గ్రామానికి చెందిన కలపాల నాగేశ్వరరావు కుమారుడు హరికృష్ణకి ఆరేళ్ల కిందట చాట్రాయి మండలానికి చెందిన సీతామహాలక్ష్మి తో వివాహం జరిగింది.mother and daughter incident in eluru

Video Advertisement

వారిద్దరూ వ్యవసాయ పనులు చేసుకుంటారు. పెళ్లై 5 సంవత్సరాలు దాటినా కూడా ఈ జంటకు పిల్లలు కలగలేదు. గత సంవత్సరం సీతామహాలక్ష్మి గర్భం దాల్చింది. డెలివరీ టైం దగ్గర పడుతుండడంతో సీతామహాలక్ష్మిని కుటుంబసభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. జులై 30వ తేదీన సీతామహాలక్ష్మి ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ పిల్లల ఆరోగ్యం బాగుండడంతో వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

new born baby

representative image

ఇంటికి వెళ్ళిన కొద్ది రోజుల తర్వాత పాప అనారోగ్యానికి గురయ్యింది. ఆగస్టు 8వ తేదీన పాపని ఏలూరు శంకరమఠం వీధిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో  చేర్పించారు. పాపకి గొంతులో ఇన్ఫెక్షన్ సోకింది అని చెప్పారు వైద్యులు. దాంతో పాపకి చికిత్స అందించారు. ఆగస్టు 11వ తేదీన పాప కోలుకుంది. దాంతో వైద్యులు డిశ్చార్జ్ చేస్తున్నట్టు చెప్పారు. హరికృష్ణ బయటికి వెళ్లి, తండ్రితో హాస్పిటల్ కి తిరిగి వచ్చారు. కానీ పాప అప్పుడు కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన హరికృష్ణ చుట్టుపక్కల పరిసరాల్లో పాప కోసం వెతికాడు.

suryapet baby 4

representative image

హాస్పిటల్ ప్రాంగణంలోని నీటి తొట్టిలో ఆ పాప విగతజీవిగా కనిపించింది. దాంతో టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, ఆ పాప తల్లి అయిన సీతామహాలక్ష్మిని ప్రశ్నించారు. సీతామహాలక్ష్మి పాపని తానే చంపినట్టు వెల్లడించింది. తనకు ఆడపిల్ల పుట్టడం నచ్చలేదు అని చెప్పింది అంతే కాకుండా పాప అనారోగ్యం బారిన పడడం తనకి మరింత విసుగు తెప్పించింది అని చెప్పింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి, రిమాండ్ కి తరలించారు.


End of Article

You may also like