మహేంద్ర సింగ్ ధోనీ. ఈ వ్యక్తికి పరిచయం అవసరం లేదు. ధోనీ తెలియనివారు బహుశా భారత దేశంలో ఉండరేమో. ఎన్నో సంవత్సరాల నుండి తన ఆటతీరుతో ఎంతో పేరు తెచ్చుకున్నారు ధోనీ. క్రికెట్ ప్రపంచం లో ఎమ్ ఎస్ ధోని ఓ సంచలనం. ఎంతటి ఒత్తిడి పరిస్థితులలైనా కూల్ గా డీల్ చేస్తూ ఆడే ధోని తత్వానికి ఎందరో ఫాన్స్ ఉన్నారు. అయితే.. ధోని రిటైర్ అవుతున్నట్లు ప్రకటించగానే క్రికెట్ అభిమానులు నిరుత్సాహపడ్డారు.

Dhoni

ధోని ని కచ్చితం గా మిస్ అవుతున్నాం అని.. ఇటీవల జరిగిన కొన్ని మ్యాచ్ లను చూసి చెప్పొచ్చు. తాజాగా.. ధోని మళ్ళీ క్రికెట్ ప్లాట్ ఫామ్ పైకి రాబోతున్నారు. అయితే.. ఈ సారి ప్లేయర్ గానో, కెప్టెన్ గానో కాదు. మెంటార్ గా వస్తున్నారు. ధోని టి 20 వరల్డ్ కప్ టీమ్ కి మెంటార్ గా వ్యవహరించబోతున్నారు. నిజం గా క్రికెట్ ఫాన్స్ కి ఇది పండగ లాంటి న్యూస్.

Dhoni

ధోని రిటైర్మెంట్ ప్రకటించాక.. ఎంత మంది అభిమానులు డల్ అయ్యారో లెక్కలేదు. తాజాగా.. వారందరికీ బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. టి 20 వరల్డ్ కప్ టీమ్ కి ఎమ్ ఎస్ ధోని మెంటర్ గా వ్యవహరించబోతున్నారు. కొద్దీ సేపటి క్రితమే.. బీసీసీఐ ట్విట్టర్ వేదిక గా ఒక పోస్ట్ ను చేసింది. ఈ పోస్ట్ తో సోషల్ మీడియా లో ఒక్కసారి గా ఊపు వచ్చింది. ఈ టాపిక్ పై సోషల్ మీడియా లో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటి పై మీరు కూడా ఓ లుక్ వేయండి.

#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12