IPL 2024 MUMBAI INDIANS: మిడిల్ ఆర్డర్ లో ఆల్ రౌండర్ల కోసం ముంబై ప్లాన్… ఆ ముగ్గురిపై కన్నేసిందిగా.?

IPL 2024 MUMBAI INDIANS: మిడిల్ ఆర్డర్ లో ఆల్ రౌండర్ల కోసం ముంబై ప్లాన్… ఆ ముగ్గురిపై కన్నేసిందిగా.?

by Mounika Singaluri

Ads

ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2024 సీజన్‌ మినీ వేలం కోసం రెడీ అవుతుంది.ఇప్పటికే ట్రేడింగ్ విండో తో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను తన జట్టులో కలిపేసుకుంది. ఇంతకుముందు హార్దిక్ గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడేవాడు. కార్తీక్ కోసం భారీ ధర వెచ్చించడంతోపాటు కామెరూన్ గ్రీన్, జోఫ్రా ఆర్ఛర్‌ లాంటి ప్లేయర్స్ ని వదులుకోవడానికి సిద్ధపడింది. ప్రస్తుతానికి ఈ ఇద్దరు ప్లేయర్లు మినహా మిగిలిన ప్రధాన ఆటగాళ్లందరిని ముంబై ఇండియన్స్ లాక్ చేసింది.

Video Advertisement

మహమ్మద్ అర్షద్ ఖాన్, రమణ్‌దీప్ సింగ్, హృతిక్ షోకీన్, రాఘవ్ గోయల్, జోఫ్రా ఆర్చర్, ట్రిస్టియన్ స్టబ్స్, డువాన్ యాన్సెన్, జై రిచర్డ్‌సన్, రీలే మెరెడిత్, క్రిస్ జోర్డాన్, సందీప్ వారియర్.. మొదలైన బ్యాకప్ ప్లేయర్స్ కు మాత్రం బై..బై చెప్పేసింది. ప్రస్తుతం ఇంకో ముగ్గురు ప్లేయర్లపై ముంబై ఇండియన్స్ కన్ను ఉంది.. వాళ్ల గురించిన డీటెయిల్స్ తెలుసుకుందాం..

#1. ప్యాట్ కమిన్స్

ఆస్ట్రేలియా వన్డే, టెస్ట్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. రెండు కోట్ల కనీస ధరతో 2024 ఐపీఎల్ వేలానికి రిజిస్టర్ చేసుకున్నాడు. ఇంతకు ముందు సంవత్సరం ఐపిఎల్ సీజన్ కి ఇతను దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం కమిన్స్ పై కన్ను ఉన్న ముంబై ఇండియన్స్ అతని భారీ ధర కైనా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇతని వల్ల జట్టు బౌలింగ్ లైనింగ్ బలపడే అవకాశం ఉంది.

#2. వానిందు హసరంగా‌

నెక్స్ట్ లిస్టులో ఉన్నది శ్రీలంకన్ ఆల్ రౌండర్ వానిందు హసరంగా‌. ప్రస్తుతానికి ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న అతను ఐపీఎల్ టైం కి రియంట్రీ ఇచ్చే ఆస్కారం ఉంది. లోయర్ ఆర్డర్ లో కూడా బ్యాటింగ్ చేయగలిగే సత్తా ఉన్న ఆటగాడు కాబట్టి టీం కి బాగా పనికి వస్తాడు.

#3. జాసన్ హోల్డర్‌

జాసన్ హోల్డర్‌.. పేస్ ఆల్ రౌండర్ అయిన ఇతన్ని కొనుగోలు చేయడానికి ముంబై ఇండియన్స్ రెడీగా ఉంది. ఇతని వల్ల మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ బలోపేతం అయ్యే అవకాశం ఉంది. మరి ఈసారి ముంబై ఇండియన్స్ వ్యూహం ఎంత వరకు పనిచేస్తుందో చూడాలి.


End of Article

You may also like