Home Bigg Boss 6 telugu ఎలిమినేట్ అయ్యాక కూడా మారలేదా..? “గీతూ” పై నెటిజన్స్ కామెంట్స్..!

ఎలిమినేట్ అయ్యాక కూడా మారలేదా..? “గీతూ” పై నెటిజన్స్ కామెంట్స్..!

by Anudeep

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగినవారు అనూహ్యంగా ఎలిమినేట్ అవుతున్నారు. ఇదివరకే టాప్ 5లో ఉంటాడనుకున్న ఆర్జే సూర్య ఎనిమిదో వారం ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లాడు. తాజాగా గీతూ రాయల్ అనుకోని విధంగా ఎలిమినేట్ అయింది.

ఇక బిగ్‌బాస్ వేదికపైన నాగార్జునతో కలిసి తన జర్నీని చూస్తూ ఎమోషనల్ అయింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండనివ్వండి.. నేను బయటకు వెళ్లను అంటూ భోరుమని విలపించింది. గీతూను ఓదార్చేందుకు నాగార్జున ప్రయత్నించాడు. చివరకు బిగ్‌బాస్ సిబ్బందిని పిలిపించి.. బయటకు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

netizens fire on geethu royal..

ఇక ఇదిలా ఉంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను బిగ్ బాస్ కేఫ్ ద్వారా యాంకర్ శివ ఇంటర్వ్యూ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేఫ్ కు గీతూ రాయల్ హాజరైంది. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వరుసపెట్టి ప్రశ్నలను గీతూ రాయల్ పై సంధించాడు శివ. వాటికి దీటుగా, తిరిగి యాంకర్ శివను క్వశ్చన్ చేస్తూ సమాధానాలిచ్చింది గీతూ రాయల్.

netizens fire on geethu royal..

మరోవైపు ఇంట్లో అందరు నాది నటన అని అన్నారు దానికి చాల హర్ట్ అయ్యా అని గీతూ చెప్పుకొచ్చింది. ప్రతి క్షణం బిగ్ బాస్ గెలవాలని ఆడిన నేను.. ఒక చిన్న కారణంతో బయటకు వచ్చానంటే నా వల్ల కావట్లేదు అంటూ ఎమోషనల్ అయ్యింది గీతూ రాయల్.

netizens fire on geethu royal..

మరోవైపు హౌస్ లో గీతూ ఆడిన ఆట ఆడియన్స్ కి నచ్చలేదు. ఆడే ప్రతి గేమ్ లో లూప్ వెతుక్కోవడం..నామినేషన్స్ లో కానీ మాములుగా కానీ ఇతరులతో మాట్లాడే విషయం లో ఆమె మాట తీరు ఇబ్బందికరం గా ఉండటం.. అలాగే బాలాదిత్య విషయం లో కూడా ఆమె ప్రవర్తన జనాలకు నచ్చలేదు. అంతా నాకు నచ్చినట్టే ఉంటా.. అంటూ నియంతలా ప్రవర్తిస్తూ.. బిగ్ బాస్ రూల్స్ కూడా బ్రేక్ చెయ్యడంతో ఆమెకు నెగిటివిటీ బాగా పెరిగిపోయింది.

netizens fire on geethu royal..
ఇక ఇంటి నుంచి బయటకు వచ్చాక కూడా బిగ్ బాస్ కేఫ్ లో కూడా అలాగే మాట్లాడంతో నెటిజన్స్ ఆమె పై ఫైర్ అవుతున్నారు. అంతా నాకే తెలుసు అంటూ హౌస్ ఉన్న వాళ్ళను తక్కువగా చేసి మాట్లాడటం, వారి తో నేను గేమ్ ఆడిపిస్తా అని కామెంట్లు చెయ్యడం వంటివి చేసి నెగిటివిటీ పెంచుకున్న గీతూ ఇంటి నుంచి బయటకు వచ్చిన తన ప్రవర్తన మార్చుకోదా అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.

 

watch video:

You may also like