సరికొత్త లుక్ తో వచ్చేసింది అంబాసిడర్2.0…

సరికొత్త లుక్ తో వచ్చేసింది అంబాసిడర్2.0…

by Anudeep

Ads

అంబాసిడర్ కార్ భారత ఆటోమొబైల్ మార్కెట్లో కారులకు కింగ్ గా చెప్పవచ్చు. ఒకప్పటి కాలంలో అంబాసిడర్ కారు ఎవరి దగ్గర ఉంటే వారు గొప్ప ధనవంతులు గా పేర్కొనేవారు. రాజకీయవేత్తలు, సినిమా స్టార్స్ అప్పటిలో  అంబాసిడర్ కారు ని ఎక్కువగా ఉపయోగించేవారు.

Video Advertisement

పోను పోను  కాలానికి అనుకూలంగా కొత్త కొత్త మోడల్ కార్లు మార్కెట్లో వచ్చేసరికి బార్డర్ కార్ కొనుగోళ్లు తగ్గిపోయాయి. ఇప్పుడు అదే అంబాసిడర్ కారు కొత్త మోడల్ లో ఎలక్ట్రిక్  వెహికల్ గా  మార్కెట్లోకి పరిచయం కానుంది. ఇప్పుడు ఈ కొత్త మోడల్ అంబాసిడర్ కార్ విధంగా ఉందంటూ  ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Old model Ambassador car

సీకే బిర్లా గ్రూప్ కి చెందిన హిందుస్థాన్ మోటార్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఉత్తమ్ బోస్ E-amboy అంబాసిడర్ కార్ లుక్ ఈ విధంగా ఉంటుందంటూ అధికారికంగా ప్రకటించారు.  ఉత్తమ్ బోస్ తన సొంత కంపెనీ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో న్యూ అంబాసిడర్ కార్ మెకానిక్ మరియు డిజైన్ వర్క్ తో పాటు సరికొత్త పద్ధతులలో ఇంజన్ ను తయారు చేస్తున్నట్లు తెలిపారు.

E-amboy ambassador

గతంలో హిందుస్థాన్ మోటార్స్ చెన్నై మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో మిత్సుబిషి కార్లను వెస్ట్ బెంగాల్ ఉత్తరపార తయారి ప్లాంట్ లో అంబాసిడర్ కారు తయారు చేసేది. 2014లో మితభాషి కార్ల తయారీ పూర్తిగా నిలిచిపోయింది. 2017 లో అంబాసిడర్ కారు మ్యానుఫ్యాక్చరింగ్ హక్కులను సైతం 80 కోట్లకు ఫ్రెంచ్ కార్ మేకర్ పూజోకి అమ్మేసింది.

Ambassador new model

మళ్లీ తిరిగి ఇన్నాళ్లకు హిందుస్థాన్ మోటార్స్ పుజో కంపెనీతో కలిసి సరి కొత్త మోడల్ అంబాసిడర్ కార్ ని తయారు చేస్తుంది. సుమారు 600 కోట్ల రూపాయల పెట్టుబడితో ఫ్రెంచ్ కార్ మేకర్ పుజోతో కలిసి అంబాసిడర్  E-amboy కారును తయారు చేయబోతున్నట్లు వెల్లడించారు ఉత్తమ్ బోస్.


End of Article

You may also like