ఐపీఎల్ 2023 కోసం క్రికెట్ అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు. సాధారణంగానే క్రికెట్ అంటే భారతదేశంలో ఉన్న క్రేజ్ ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఐపీఎల్ అంటే ఆ క్రేజ్ ఇంకా పెరుగుతుంది. ఒకప్పటితో పోలిస్తే క్రికెట్ ఇప్పుడు చాలా మారిపోయింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో ఎప్పటికప్పుడు వస్తున్న సరికొత్త రూల్స్.. ఆటను మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి.
Video Advertisement
ఇక ఐపీఎల్ 2023కి అన్ని ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఈ సీజన్‌లో మొత్తం 10 ఫ్రాంచైజీ లు పాల్గొంటున్నాయి. ఒక్కో జట్టు మొత్తం 14 లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ 14 మ్యాచ్‌లలో, 7 వారి సొంత మైదానంలో ఆడతారు.. మిగిలినవి హోమ్ గ్రౌండ్ కి దూరం గా ఆడతారు.
టైమ్స్ ఆఫ్ స్పోర్ట్స్ కథనం ప్రకారం, ఐపీఎల్ 2023 లో పలు కొత్త నిబంధనలు ప్రవేశపెట్టారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
#1 ఈ సీజన్ లో ఒక్కో మ్యాచ్ కి రెండు డీఆర్ఎస్ లు ఉంటున్నాయి.
#2 ఐపీఎల్‌లో వైడ్‌లు మరియు నో-బాల్‌ల కోసం ఆటగాళ్లు రివ్యూలు తీసుకోవచ్చు.
#3 క్యాచ్ ఔట్ అయిన తర్వాత, బ్యాట్స్‌మెన్ క్రాస్ చేశారా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఇన్‌కమింగ్ బ్యాట్స్‌మన్ స్ట్రైక్ తీసుకుంటాడు.
#4 కోవిడ్ కారణం గా ఎవరైనా ఆటగాడు మ్యాచ్ ఆడలేకపోతే ఆ మ్యాచ్ ని రీ షెడ్యూల్ చేస్తారు.
#5 ఒకవేళ రీ షెడ్యూల్ చెయ్యడం కుదరకపోతే ఐపీఎల్ టెక్నికల్ టీం ఎం చెయ్యాలో సూచిస్తుంది.
#6 ప్లేఆఫ్‌లు/ఫైనల్‌లో: కొన్ని కారణాల వల్ల సూపర్ ఓవర్ లేదా తదుపరి సూపర్ ఓవర్‌లు పూర్తి చేయలేకపోతే లీగ్‌లో ఎక్కువ పూర్తి చేసిన జట్టును విజేతగా ప్రకటిస్తారు.
#7 మరో ఇంపార్టెంట్ నియమం ఏంటంటే.. ఇంపాక్ట్ ప్లేయర్..
ఐపీఎల్‌లో ఈ నిబంధనను అమలు చేయడం వల్ల టాస్ సమయంలో, కెప్టెన్ తన ప్లేయింగ్ ఎలెవన్‌తో పాటు మరో నలుగురు ఆటగాళ్ల పేర్లను చెప్పాలి. వీరినుంచి ఈ రెండు జట్లు ఒక ఆటగాడిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకోవచ్చు.
సింపుల్ గా చెప్పాలంటే సబ్ స్టిట్యూట్ ప్లేయర్ నే ఇంపాక్ట్ ప్లేయర్ గా అభివర్ణిస్తున్నారు. అలా వచ్చిన ప్లేయర్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేసే వీలు ఉంటుంది. అది కూడా ఇన్నింగ్స్ 14వ ఓవర్ లోపు మార్చాలి. ఇది రెండు ఇన్నింగ్స్ లకు వర్తిస్తుంది. 15 నుంచి 20 ఓవర్ల మధ్య ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ను తీసుకోవడం జరగదు. ఇంపాక్ట్ ప్లేయర్ ను ఉపయోగించేటప్పుడు ఆ విషయాన్ని కెప్టెన్ ఫీల్డ్ అంపైర్ తో గానీ లేక ఫోర్త్ అంపైర్ తో గానీ చెప్పాల్సి ఉంటుంది.