Ads
టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత మహేంద్రసింగ్ ధోనీది.. బ్యాటింగ్‌తో పాటు కీపింగ్‌లోనూ ప్రత్యేతకను చాటుకున్నాడు. మ్యాచ్‌లో వికెట్ల వెనకాల నుంచి ధోనీ అప్పీల్ చేశాడంటే అంపైర్ కూడా తన నిర్ణయంపై పునరాలోచనలో పడేవాడు. డీఆర్‌ఎస్ విధానం ప్రవేశపెట్టాక దానిపై పూర్తి స్పష్టత ఏర్పరచుకున్న ధోనీ.. తన అప్పీల్‌తో ఎన్నోసార్లు అంపైర్ల నిర్ణయాలు తప్పని నిరూపించాడు.
Video Advertisement
రివ్యూ తీసుకోవడంలో ధోనీనీ మించిన వారు లేరన్నది నిజం. దీంతో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్‌ఎస్) కాస్తా ధోనీ రివ్యూ సిస్టమ్ అన్నట్టుగా మారిపోయింది. అయితే, ధోనీ రిటైర్మెంట్ తర్వాత డీఆర్‌ఎస్ విషయంలో అతనిలాంటి సమర్ధుడు జట్టులో ఉన్నాడా అంటే.. ఇప్పుడు కేఎల్ రాహుల్ పేరు వినిపిస్తోంది.
తాజాగా 2023 వండే ప్రపంచ కప్పులో కేఎల్ రాహుల్ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. బ్యాటింగ్ తోనే కాకుండా వికెట్ల వెనకాల కూడా చురుకుగా కదులుతున్నాడు. కెప్టెన్ రోహిత్‌కు సరైన సలహాలిస్తూ జూనియర్ ధోనీ అనిపించుకుంటున్నాడు.ప్రస్తుత ప్రపంచ కప్ లో డీఆర్‌ఎస్ పై అప్పీలు కెళ్లే విషయంలో కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడంలో సదరు బౌలర్ లేదా కెప్టెన్‌కు కనీసం ఐదు సందర్భాల్లో రాహుల్ సరైన సలహాలిచ్చాడు.అందుకే ఒక్కోసారి బౌలర్లు గట్టిగా చెప్పినా, రాహుల్ ఒప్పుకుంటేనే రోహిత్ రివ్యూకు వెళ్తున్నాడు. రోహిత్ కూడా నిర్ణయం తీసుకోలేని సమయంలో రాహుల్ మాటకే విలువిస్తున్నాడు.
వికెట్ కీపర్‌గా రాణిస్తూనే, మిడిలార్డర్ బ్యాటర్‌గానూ సత్తాచాటుతున్న రాహుల్.. రివ్యూ పరంగానూ జట్టుకు అండగా ఉంటూ ధోనీని మరిపిస్తున్నాడు. ధోనీ లాంటి వికెట్ కీపర్ మళ్లీ వస్తాడా రాడా అన్న ప్రశ్నలకు రాహుల్ సమాధానంగా దొరికాడు అంటూ ఇండియన్ ఫ్యాన్స్ సంబర పడుతున్నారు.ఈ వరల్డ్ కప్ లో చాలా మ్యాచ్ లలో వికెట్లు వెనకాల డైవింగ్ చేస్తూ ఎన్నో క్యాచ్ లు పట్టాడు. ఆ క్యాచ్ ల వల్ల కీలకమైన మ్యాచ్ లు మలుపు తిరిగిన సందర్భం కూడా ఉంది. అలాగే వికెట్ ల వెనకాల నుండి బౌలర్లకు కూడా సూచనలు ఇవ్వడంలో కేఎల్ రాహుల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇదే ఫామ్ కొనసాగిస్తే ధోనీనీ మించిపోయిన ఆశ్చర్యపోవక్కర్లేదు.
Also Read:ఇండియా, ఆస్ట్రేలియా మధ్యలో… జ్యోతిష్యం ప్రకారం వరల్డ్ కప్ కొట్టే జట్టు ఇదేనా..?
End of Article