పాత మొబైల్ ఫోన్ ని అమ్మేసి కొత్త మొబైల్ ను తీసుకుంటున్నారా..? అయితే ఈ స్కామ్ విషయం లో జాగ్రత్త పడండి..!

పాత మొబైల్ ఫోన్ ని అమ్మేసి కొత్త మొబైల్ ను తీసుకుంటున్నారా..? అయితే ఈ స్కామ్ విషయం లో జాగ్రత్త పడండి..!

by Megha Varna

Ads

మీ పాత ఫోన్ పాడైపోయిందా..? మీరు ఆ పాత ఫోన్ ని అమ్మేసి కొత్త ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటున్నారా..? అయితే తప్పకుండా మీరు వీటి కోసం తెలుసుకోవాలి. ఈ రోజుల్లో స్కాములు ఎక్కువైపోతున్నాయి. అసలు స్కాములు ఎలా జరుగుతున్నాయి అనేది తెలుసుకుంటే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడొచ్చు. దీనితో మోసపోకుండా ఉండడానికి అవుతుంది.

Video Advertisement

అయితే ఈ మధ్య కాలంలో మనం పాత వస్తువుల్ని అమ్మేసి కొత్త వస్తువులని సులువుగా ఆన్ లైన్ లోనే కొనుక్కోవచ్చు. అయితే పాత వస్తువులను అమ్మే పద్ధతిలో కొన్ని రకాల స్కాములు ఉంటూ ఉంటాయి. ఓఎల్ఎక్స్ లో కానీ ఇంకెక్కడైనా కానీ ఏదైనా పాత వస్తువులు పెడితే తిరిగి ఇంత డబ్బుకి తీసుకోవాలని అనుకుంటున్నాను అని ఎవరైనా బేరం ఆడతారు. దానికి మనం సరే అంటే వాళ్ళు ఫోన్ తీసుకుంటామని చెప్తూ ఉంటారు. ఆ రేటు కూడా మనకి ఓకే అయితే ఫోన్ ని వాళ్ళకి అమ్మొచ్చు. అయితే పాత వస్తువుకి ఎక్కువ ధర వస్తోంది కదా అని మనం టెంప్ట్ అవ్వడం సహజం.

ఆ వ్యక్తి కూడా నేను వస్తానని.. కావాలంటే మీరు చెక్ చేసుకోండి అని ఇలా ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. కొంత మంది అయితే ఒక రూపాయి పంపిస్తాము అని ముందే ఒక రూపాయి సెండ్ చేస్తారు. తర్వాత ఎవరో వస్తారు ఆ ఫోన్ ని తీసుకెళ్తారు అన్నట్లు చెప్తూ ఉంటారు. ఇలా ఎవరికి తగ్గ కధల్ని వాళ్ళు చెబుతూ ఉంటారు. అలానే అడ్వాన్స్ ఇస్తామని.. 30,000 ఇస్తున్నట్లు మెసేజ్ వస్తుంది. మనం పొరపాటున డబ్బులని పంపారు అని అనుకుంటాము. కాని వాళ్ళు డబ్బులు తీసుకోవడానికి రిక్వెస్ట్ పెడుతూ ఉంటారు.

మనం ఆనందంలోనో లేదా కంగారు లోనూ 30,000 గురించి మాట్లాడాను కదా అని ఒకే కొట్టేస్తూ ఉంటాము. డిక్లైన్ మీద కాకుండా పే చేసి ఇక్కడ మనం పొరపాటు చేస్తాము. వెంటనే మన ఖాతా నుంచి వాళ్ళకి ఖాతాలోకి డబ్బులు వెళ్లిపోతాయి. తర్వాత ఫోన్ ఎవరు తీసుకోరు. అలానే మన డబ్బులు కూడా పోగొట్టుకున్నట్లు అయింది. ఈ తరహాలో స్కామ్లు ఉంటాయి. కాబట్టి ఇటువంటి స్కామ్స్ తో జాగ్రత్తగా ఉండండి. సైట్స్ జెన్యూన్ అయినా సరే జాగ్రత్తపడాలి లేదంటే ఇలానే అనవసరంగా మోస పోవాల్సి వస్తుంది.

Watch Video:


End of Article

You may also like