“కిన్నెర” ఒకప్పుడు సీరియల్స్ లో తన హవా చాటిన నటి. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసినప్పటికి సీరియల్ నటిగా వచ్చినంత గుర్తింపు రాలేదు . ఈ మధ్య కాలంలో సెక్స్ రాకెట్లో చిక్కుకుని “అయ్యో కిన్నెర నా” అని అభిమానులు బాధపడేట్టు చేసింది . కొందరి ఆగ్రహానికి గురైంది. తాజాగా పరుచూరి గోపాలకృష్ణ కిన్నెర గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు . అలాంటి కిన్నెర ఇలాంటి పని చేసిందా అని ఆశ్చర్యం కలుగుతుంది.
“విధి” సీరియల్ ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే . రోజీగా యమున , లక్ష్మిగా కిన్నెర తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. ఇప్పటికి ఆ సీరియల్ క్రేజ్ తగ్గలేదు . సీక్వెల్ కూడా వస్తుంది.విధి సీక్వెల్లో యమున నటిస్తున్నప్పటికి , కిన్నెర దూరంగానే ఉంది.కారణాలు తెలియదు .
చెట్టు కింద ప్లీడరు సినిమాలో రాజేంద్రప్రసాద్ సరసన నటించింది. అడపాదడపా కొన్ని చిత్రాల్లో నటించినప్పటికి ఫైనల్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిపోయింది. ఒక హీరోయిన్ కావాల్సిన లక్షణాలు అనగా అందం , అభినయం అన్నీ కిన్నెరలో భేషూగ్గా ఉన్నాయి, అయినప్పటికి కాలేకపోయింది. విధి అంతే ఎవరిని ఎటువైపు తీస్కెళ్తుందో అని ఆ నాటి జ్ణాపకాలను గుర్తు చేసుకున్నారు పరుచూరి.
తన యూట్యూబ్ ఛానెల్ అప్పటి విశేషాలను చెప్పుకొచ్చే పరుచూరి కిన్నెర కి సంభందించిన ఒక జ్ణాపకాన్ని చెప్పారు. ఒకసారి ఒక షూటింగ్ జరుగుతున్నప్పుడు, అక్కడ జడ్జి ఒక అమ్మాయిని బూతుమాటలు తిడుతున్నాడట , ఆ సంఘటన కిన్నెర కంట పడడంతో ,వెంటనే వెళ్లి పరుచూరికి చెప్పి పోలీసుల కి కంప్లైంట్ ఇవ్వమన్నదట. ముందు ఆయన జడ్జో కాదో తెలుసుకోవాలి కదమ్మా అంటే, మీరు కంప్లైంట్ చేస్తారా ,నేను చేయాలా అని దబాయించిందట.
కిన్నెర అంత సీరియస్ గా చెప్పేసరికి నేనే చేస్తాను అని డిఎస్పీకి కాల్ చేశారట పరుచూరి . జడ్జి గురించి మాకు కంప్లైంట్ చేయడం ఏంటని అవతల నుండి డిఎస్పీ సమాధానం . సరే ఎన్టీరామారావు గారికి చేస్తాను అని పరుచూరి అనగానే , సార్ సార్ ఇంత చిన్న విషయానికి సిఎం గారి వరకు ఎందుకు, మేమొస్తున్నాం అని అన్నారట. పోలీసులు వచ్చేసరికి నఖిలీ జడ్జి, అతని ఫ్రెండ్స్ పరార్. వెంటనే కిన్నెర థాంక్యూ అని విసురుగా చెప్పి వెళ్లిపోయిందట , ఆ సంగతి నాకు ఇంకా గుర్తు.
మరొకసారి ఒక సినిమా షూటింగ్లో మార్చురి సీన్లో చీర కట్టుకున్న కిన్నెరని, చీర వద్దమ్మా, కనీసం వీపు వరకన్నా కనపడాలి శరీరం, ససేమిరా ఒప్పుకోలేదట. తన విషయంలో, పరాయి అమ్మాయి విషయంలో ఇంత జాగ్రత్తగా ఉన్న కిన్నెరా, ఎక్స్ రాకెట్ పేరిట ఇంతమంది అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడింది అని బాధనిపించింది. అసలు నమ్మబుద్ది కాలేదు . కిన్నెర వీడియోల పేరిట రిలీజైన వీడియోలను కూడా చూడాలనింపించలేదు.అని గతాన్ని తలచుకుని వర్తమానంలో జరిగినదానికి బాధపడ్డారు పరుచూరి.
నిజమే విధి ఎవరినెప్పుడు ఎలా మారుస్తుందో ఎవరికి తెలీదు . అవకాశాలున్నన్ని రోజులు దర్జాగా బతికిన వాళ్లు, ఆ బతుక్కి అలవాటు పడ్డవారు, అవకాశాలు లేకపోయే సరికి డబ్బుకోసం ఎంతకైనా దిగజారుతారు. ముఖ్యంగా లేడీ ఆర్టిస్టుల పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఇలాంటి ఆరోపణలే యమునా, ఐశ్వర్య, శ్వేతా బసు ప్రసాద్ పైన వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అవకాశాలున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి.
watch video: