ఐపీఎల్ కోసం క్రికెట్ ప్రేక్షకులందరూ ఏ రేంజ్ లో ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ వచ్చిందంటే చాలు సాధారణంగానే టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ వీక్షించే ప్రేక్షకులు.. ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ వాయిదా పడుతూ రావడంతో అభిమానులందరికీ నిరాశే ఎదురైంది.
Video Advertisement
ఇక ఐపీఎల్ టోర్నీ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభ చాటుకుని భారత జట్టులో స్థానం సంపాదించడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కేవలం భారత్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఐపీఎల్ టోర్నీకీ ఎంతో గుర్తింపు ఉంది. అంతేకాదు విదేశీ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ టోర్నీలో ఆడే ఎందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.
ఇక మార్చి 31 న చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే మ్యాచుతో ఐపీఎల్ 2023 ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ సన్నాహకాల్ని ప్రారంభించాయి. అయితే ఈ ఏడాది ముంబై ఇండియన్స్‌తో సహా 6 జట్ల ప్లేయర్స్ వివిధ కారణాలతో టోర్నీ కి దూరం అయ్యారు.
వారెవరో ఇప్పుడు చూద్దాం..
#1 రిషబ్ పంత్
డిసెంబరు 31, 2022న జరిగిన కారు ప్రమాదంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో రిషబ్ కాలికి రెండు సర్జరీలు చేయగా.. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు. దీంతో.. రిషబ్ పంత్ ఐపీఎల్ తో పాటు కీలక టోర్నీలకు కూడా దూరమయ్యాడు. ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్‌కు ఢిల్లీ క్యాపిటల్ జట్టు కెప్టెన్సీని అప్పగించారు.
#2 జస్ప్రీత్ బుమ్రా
ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గత కొన్నేళ్లుగా వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. కొన్ని రోజుల క్రితం వెన్నునొప్పి శస్త్రచికిత్స చేయించుకోవడం తో బుమ్రా ఈ సీజన్ లో ఆడటం లేదు.
#3 జే రిచర్డ్‌సన్
కొద్ది రోజుల క్రితం ఈ ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ అనారోగ్యం తో శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
#4 కైల్ జేమిసన్
ఈ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు వెన్నుగాయం తో బాధ పడుతున్నాడు.. ఆ గాయం ఇంకా తగ్గకపోవడం తో అతడు ఈ సీజన్ కి అందుబాటులో లేడు.
#5 ప్రసిద్ధ్ కృష్ణ
కృష్ణకు కొన్ని నెలల క్రితం శస్త్రచికిత్స కూడా జరిగింది. ప్రస్తుతం అతడు ఫిట్ గా లేడు. దీంతో ఈ స్టార్ బౌలర్ ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరం కానున్నాడు.
#6 విల్ జాక్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్ విల్ జాక్స్ కండరాల గాయం కారణంగా IPL 2023 నుంచి తప్పుకున్నాడు. విల్ జాక్స్ స్థానంలో మైఖేల్ బ్రేస్‌వెల్‌ను ఎంపిక చేసింది.
#7 శ్రేయాస్ అయ్యర్
కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయం కారణంగా రాబోయే IPL 2023 మరియు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ నుండి తప్పుకున్నాడు.
#8 జానీ బెయిర్ స్టో
ఈ పంజాబ్ కింగ్స్ ఆటగాడు కాలు గాయం కారణంగా ఈ సీజన్ కి దూరం కానున్నాడు. అతడి స్థానం లో మాథ్యూ షార్ట్ ఆడనున్నాడు.
#9 అన్రిచ్ నోర్ట్జే
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్ అన్రిచ్ నోర్ట్జే గాయం కారణంగా ఐపీయల్ 2023లో ఆడటం లేదు.