Ads
ఛత్తీస్గఢ్ లో ని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో తాజాగా భారత్, ఆస్ట్రేలియా మధ్య T20 ఇంటర్నేషనల్ నాలుగో మ్యాచ్ జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మరికొద్ది గంటల్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుండగా ఇంతలోనే ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
Video Advertisement
అంతా బాగుంది మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్న సమయంలో స్టేడియంలో పవర్ కట్ అయింది. చాలా చోట్ల సప్లై నిలిపివేశారు. 2009 నుంచి బిల్ కట్టలేదట. అందుకే సరిగ్గా మ్యాచ్ ముందే పవర్ కట్ చేశారు. 2009 నుంచి ఇప్పటి వరకు పవర్ బిల్ కట్టకపోవడంతో రూ.3.16 కోట్ల బిల్ పెండింగ్లో ఉంది.
ఐదేళ్ల క్రితమే పవర్ కట్ చేశారు. అయితే ఛత్తీస్గఢ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ రిక్వెస్ట్ మేరకు టెంపరరీ కనెక్షన్ ఇచ్చారు. అది కేవలం గ్యాలరీ, బాక్స లకు మాత్రమే సప్లై అవుతుంది. ఇవాళ మ్యాచ్లో ఫ్లడ్ లైట్స్ ని జనరేటర్లు పెట్టి ఆన్ చేయక తప్పదంటున్నారు నిర్వాహకులు. అయితే ఈ సమస్య రాకూడదనే ముందుగానే క్రికెట్ అసోసియేషన్ సభ్యులు పవర్ కెపాసిటీని ఇంకొంత పెంచాలని అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పవర్ లైన్ కెపాసిటీ 200 కేవీ.
దీన్ని వెయ్యి కిలో వోల్ట్ లకు పెంచాలని రిక్వెస్ట్ చేసుకోగా అధికారులు అందుకు అంగీకరించారు. కానీ ఇప్పటి వరకు ఆ పనులేమీ మొదలు కాలేదు. అయితే 2018లో ఇదే స్టేడియంలో హాఫ్ మ్యారథాన్ జరిగినప్పుడు అప్పట్లో పవర్ సప్లై లేక అథ్లెట్స్ చాలా ఇబ్బంది పడ్డారు. 2009 నుంచి రూ.3.16 కోట్ల బిల్ పెండింగ్లో ఉందని అప్పుడే తెలిసింది. ఈ స్టేడియం నిర్మాణం పూర్తైన తరవాత నిర్వహణ బాధ్యతల్ని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కి అప్పగించారు. మిగతా ఖర్చులన్నీ క్రీడాశాఖ భరిస్తోంది.
ప్రస్తుతం కరెంట్ బిల్ కట్టకపోవడంపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పటికే విద్యుత్ సంస్థ PWDతో పాటు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కు చాలా సార్లు నోటీసులు పంపింది. పెండింగ్ పేమెంట్ క్లియర్ చేయాలని తేల్చి చెప్పింది. కానీ ఈ బిల్ క్లియర్ కాలేదు. 2018లో పవర్సప్లై కట్ చేశారు. అప్పటి నుంచి ఈ స్టేడియంలో మూడు అంతర్జాతీయ మ్యాచ్లు జరిగాయి. మ్యాచ్ లకు ఎలాంటి అంతరాయం కలగదని, ప్రత్యామ్నాయాలు సిద్ధంగా ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు.
ALSO READ : మాయమైన 7 కేజీల బంగారం… డిప్యూటీ మేనేజర్ ఆత్మహ-త్య…!
End of Article