ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్ దశకు చేరువవుతోంది. టాప్-4లో నిలవడం కోసం ఇప్పటికీ 9 జట్లు పోటీ పడుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. పోటీలో 9 జట్లు ఉన్నప్పటికీ.. టాప్-5లో ఉన్న జట్లకే ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Video Advertisement

ఇప్పటికే 16 పాయింట్లు సాధించిన గుజరాత్ టైటాన్స్ ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ కూడా తదుపరి దశకు అర్హత సాధించడం తేలికే. ఆ జట్టు ఒక్క విజయం సాధించినా సరిపోతుంది. రాజస్థాన్, ముంబై, లక్నో సహా మిగతా జట్లు మిగతా రెండు స్లాట్ల కోసం పోటీ పడుతున్నాయి.

 

SEE HOW THIS RCB FAN CALULATED THEIR TEAM PLAYOFFS PROBABILITIES..

అయితే ఐపీఎల్ ని విజయంతో ఆరంభించి.. ఓ దశలో మంచి ఊపు మీద కనిపించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు ప్లేఆఫ్ రేసులో వెనుకంజ వేసింది. ఆర్సీబీ తన తదుపరి మ్యాచ్‌ల్లో రాజస్థాన్, హైదరాబాద్, గుజరాత్ జట్లతో తలపడనుంది. ఆర్సీబీ నెట్ రన్ రేట్ మైనస్‌ 0.345 ఉండటంతో.. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ఘన విజయాలు సాధిస్తేనే ప్లేఆఫ్ చేరుకుంటుంది.

SEE HOW THIS RCB FAN CALULATED THEIR TEAM PLAYOFFS PROBABILITIES..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలపై లెక్కలు కట్టిన అభిమానులు వాటిని సోషల్‌ మీడియాలో క్రికెట్ అభిమానులతో పంచుకుంటున్నారు. బెంగళూరు మిగతా మూడు మ్యాచ్‌ల్లో గెలవాలి. అప్పుడే ఆ జట్టు రన్‌రేట్ గణనీయంగా మెరుగవుతుంది. ఆర్సీబీ అభిమానులు కోరుకున్నట్టుగానే కోల్‌కతాపై రాజస్థాన్ విజయం సాధించింది. అలాగే ముంబైపై గుజరాత్ గెలవాలట. లక్నోపై సన్‌రైజర్స్.. పంజాబ్‌పై ఢిల్లీ గెలుపొందాలి.

SEE HOW THIS RCB FAN CALULATED THEIR TEAM PLAYOFFS PROBABILITIES..

తర్వాత రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవాల్సి ఉంటుంది. చెన్నైను కోల్‌కతా ఓడించి.. హైదరాబాద్‌పై గుజరాత్ గెలవాలి. తర్వాత లక్నోపై ముంబై, పంజాబ్‌పై ఢిల్లీ, సన్‌రైజర్స్‌పై ఆర్సీబీ గెలవాలి. రాజస్థాన్‌పై పంజాబ్, చెన్నై‌పై ఢిల్లీ, లక్నోపై కోల్‌కతా గెలుపొందాలి. సన్‌రైజర్స్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబైని ఓడించాలి. అప్పుడు బెంగళూరు తన లాస్ట్ మ్యాచ్‌లో గుజరాత్‌ను ఓడిస్తే.. 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరడమే కాదు.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలుస్తుంది.

SEE HOW THIS RCB FAN CALULATED THEIR TEAM PLAYOFFS PROBABILITIES..

సింపుల్ గా చెప్పాలంటే.. బెంగళూరు ప్లేఆఫ్స్ చేరాలంటే.. ఢిల్లీ క్యాపిటల్స్ తన చివరి మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించాలి. చెన్నై తన చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. కోల్‌కతా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, ముంబై ఒక్క మ్యాచ్‌లో గెలుపొందాలి. రాజస్థాన్ తన చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. పంజాబ్ ఒక్క మ్యాచ్‌లోనే గెలవాలి, అది కూడా రాజస్థాన్ మీద. ఇలా జరిగితే.. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఇదంతా జరిగే పనేనా అనిపిస్తుందా.. ఆర్సీబీ అభిమానులు మాత్రం కచ్చితంగా జరుగుతుందని ఈ పోస్ట్ ని తెగ వైరల్ చేస్తున్నారు.