Ads
ఐపీఎల్ 2024 లో నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఊహించని విధంగా విజయం సాధించింది. ఉప్పల్ లో జరిగిన ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు 35 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ లలో బెంగళూరు జట్టు 2 మ్యాచ్ లలో గెలిచింది. ఇప్పుడు బెంగళూరు జట్టు తదుపరి దశకి చేరుకోవడం అనేది కాస్త కష్టం. అయినా కూడా సాంకేతికంగా ఇప్పటికీ కూడా పోటీలోనే ఉన్నట్టు లెక్క అవుతుంది. మిగిలిన మ్యాచ్ లలో గెలిస్తే బెంగళూరు జట్టుకి 14 పాయింట్లు యాడ్ అవుతాయి.
Video Advertisement
ఇప్పుడు బెంగళూరు జట్టు అభిమానులు కొత్త డిమాండ్ చేస్తున్నారు. ఫైనల్ డేట్ మార్చాలి అంటూ కోరుతున్నారు. అందుకు కూడా ఒక కారణం ఉంది. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం 2 మ్యాచ్ లలో గెలిచింది. ఆ రెండు కూడా ఒక మ్యాచ్ మార్చ్ 25వ తేదీన గెలిస్తే, ఇంకొక మ్యాచ్ ఏప్రిల్ 25వ తేదీన గెలిచింది. దాంతో ఫైనల్స్ కి చేరినప్పుడు, ఫైనల్స్ కూడా మే 25వ తేదీన నిర్వహిస్తే బెంగళూరు జట్టు కప్ కొట్టే అవకాశం ఉంది అని, ఈ కారణంగానే ఫైనల్ తేదీ మే 26 కాకుండా మే 25 పెట్టాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ విషయం మీద కామెంట్స్ వస్తున్నాయి. కానీ ఇదంతా జరగాలి అంటే బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలి. ఈ విషయం మీద కూడా కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇంక నిన్న జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడితే, బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 206 పరుగుల స్కోర్ చేసింది. రజత్ పటిదార్ (50; 20 బంతుల్లో, 2×4, 5×6) హాఫ్ సెంచరీ చేయగా, కామెరూన్ గ్రీన్ (37*; 20 బంతుల్లో, 5×4), విరాట్ కోహ్లి (51; 43 బంతుల్లో, 4×4, 1×6) స్కోర్ చేశారు. వీరిలో విరాట్ కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ చేశారు. హైదరాబాద్ జట్టు బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ మూడు వికెట్లు పడగొట్టారు.
ALSO READ : ఈ 5 మంది హీరోయిన్స్ వీళ్లతో జత కడతారు అని ఎవ్వరూ ఊహించి ఉండరు.! లిస్ట్ లుక్ వేయండి.!
End of Article