అందుకే రోహిత్…దినేష్ కార్తీక్ పీక పట్టుకున్నాడంట.? ఆలస్యంగా వెలుగులోకొచ్చిన అసలు నిజం.!

అందుకే రోహిత్…దినేష్ కార్తీక్ పీక పట్టుకున్నాడంట.? ఆలస్యంగా వెలుగులోకొచ్చిన అసలు నిజం.!

by Anudeep

ఆస్ట్రేలియా తో జరిగిన తొలి టీ 20 లో భారత జట్టు ఓటమి పాలైన సంగతి తెల్సిందే. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్ లలో.. 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 19.2 ఓవర్ లలో లక్ష్య ఛేదన చేసి గెలిచింది.
ఈ ఇన్నింగ్స్ సమయం లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకున్న విషయం తెల్సిందే. టీం ఇండియా కెప్టెన్ రోహిత్ కీపర్ దినేష్ కార్తిక్ పై ఆగ్రహం వ్యక్తం చేసాడు. రివ్యూ లా విషయం లో భారత జట్టు కాస్త అలసత్వం ప్రదర్శించడంతో మాన్ అఫ్ ది మ్యాచ్ కామెరూన్ గ్రీన్ కి లైఫ్ లభించింది.

Video Advertisement

rohit-DK issue..
అలాగే పన్నెండో ఓవర్ లో స్టీవ్ స్మిత్ కీపర్ షాట్ ట్రై చేస్తే అది దినేష్ కార్తిక్ చేతిలో పడింది. దినేష్ దాన్ని అప్పీల్ చెయ్యగా ఎంపైర్ నాట్ అవుట్ అన్నారు. భారత్ రివ్యూ కి వెళ్లగా ఒక వికెట్ లభించింది. అదే ఓవర్ లో మాక్స్ వెల్ బ్యాట్ కు దగ్గరగా బాల్ వెళ్ళింది. దానికి కీపర్ అప్పల్ చెయ్యలేదు కానీ భారత జట్టు అప్పీల్ చేసింది. తర్వాత కెప్టెన్ రోహిత్ రివ్యూ కి వెళ్లగా భారత్ కు మరో వికెట్ లభించింది.
ఆ తర్వాత రోహిత్ శర్మ దినేష్ కార్తిక్ పీక పట్టుకొని ” నీకెన్ని సార్లు చెప్పా అప్పీల్ చెయ్యమని..లేదా నాకైనా చెప్పావు రివ్యూ కి వెళదామని” అంటూ అన్నాడు. తర్వాత రోహిత్ ప్రేక్షకుల వైపు తిరిగి కన్ను కొట్టాడు. దీంతో ఇదంతా సరదాగా జరిగిందని అర్థమవుతోంది.

rohit-DK issue..
ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ గురువారం మీడియాతో మాట్లాడాడు. జర్నలిస్ట్‌లు అడగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పాడు. ఈ క్రమంలోనే తొలి టీ20లో డీఆర్‌ఎస్ విషయంలో అలసత్వంగా ఉన్న దినేశ్ కార్తీక్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటనను సూర్య ముందు ప్రస్తావించగా.. అతను అసలు విషయం వెల్లడించాడు.

rohit-DK issue..
‘మైదానంలో చాలా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు సరదా ఘటనలతో పరిస్థితులను మాములగా చేయాల్సి ఉంటుంది. కానీ ఫోకస్ మాత్రం గేమ్‌పైనే ఉంటుంది. డీఆర్‌ఎస్ విషయంలో కొన్నిసార్లు తప్పులు జరగడం సహజం. బ్యాట్‌ ఎడ్జ్ సౌండ్ కీపర్లకు వినపడకపోవచ్చు. ఇక రోహిత్, దినేశ్ కార్తీక్ చాలా ఏళ్లుగా కలిసి ఆడుతున్నారు. సరదాగా తిట్టుకునేంత సాన్నిహిత్యం వారి మధ్య ఉంది.’అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.


You may also like