IPL కప్ గెలువకపోయినా కూడా… RCB సాధించిన ఈ 7 “రికార్డ్స్” ఏంటో తెలుసా..?

IPL కప్ గెలువకపోయినా కూడా… RCB సాధించిన ఈ 7 “రికార్డ్స్” ఏంటో తెలుసా..?

by kavitha

ఇండియన్ ప్రీమియర్ లీగ్  16వ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్ కప్ గెలవని ఆర్సీబీ జట్టు ఎలాగైనా ఈసారి కప్‌ గెలవాలని బరిలోకి దిగింది. కానీ ఈసారి కూడా ఆర్సీబీకి నిరాశే ఎదురైంది. ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైంది.

Video Advertisement

ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో బెంగళూరు ఓటమిపాలైంది. కాగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటిదాకా ఒక్కసారి ట్రోఫీని అందుకోలేకపోయినా ఐపీఎల్ చరిత్రలో ఎన్నో రికార్డులను సృష్టించింది. ఇక రికార్డుల విషయంలో అగ్రస్థానంలో ఉంది. ఆ రికార్డ్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.. 1.హైయ్యేస్ట్ పార్టనర్ షిప్ (229 ):

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జట్టు ఆర్సీబీ. ఈ హైయ్యేస్ట్ పార్టనర్ షిప్ లో టాప్ 1, టాప్ 2 స్థానంలో విరాట్ కోహ్లీ, AB డివిలియర్స్ మధ్యనే వచ్చాయి. 2016 ఐపీఎల్ లో గుజరాత్ లయన్స్‌కు, ఆర్సీబీ  మధ్యన జరిగిన మ్యాచ్ లో కోహ్లీ, డివిలియర్స్ సెకండ్ వికెట్‌కు 229 పరుగులు చేసి ఐపీఎల్ లోనే అతిపెద్ద భాగస్వామ్యంను  నెలకొల్పారు. 2015లో జరిగిన ఐపీఎల్ లో ఇదే జోడీ ముంబై జట్టుతో ఆడిన మ్యాచ్ లో 215*తో రెండవ అతిపెద్ద భాగస్వామ్యంను నమోదు చేసింది.
2. అత్యధిక ఐపీఎల్ స్కోర్(263/5): 

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ఆర్సీబీ రికార్డ్ క్రియేట్ చేసింది. 263/5తో ఛేదించిన రికార్డు ఆర్సీబీ పేరిట ఉంది. 2013లో బెంగుళూరులో పూణే వారియర్స్ జట్టు పై ఆర్సీబీ 263/5 స్కోర్ చేశారు. క్రిస్ గేల్ 66 బంతులలో 175 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. దీంతో ఆర్సీబీ 130 పరుగుల భారీ తేడాతో పూణే జట్టుపై విజయం సాదించింది.
3. అత్యధిక వ్యక్తిగత స్కోరు(175 ):

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ఆర్సీబీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఐపీఎల్‌ చరిత్రలో 2 అత్యధిక స్కోర్‌లు ఆర్సీబీ ఆటగాళ్లే సాధించారు. 2013 సీజన్‌లో పూణె జట్టు పై క్రిస్ గేల్ అత్యధిక వ్యక్తిగత  స్కోరును చేశాడు. 65 బంతుల్లోనే 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇప్పటికీ ఈ రికార్డ్ అలాగే ఉంది.4. అత్యధిక సెంచరీలు(16):

ఆర్సీబీ జట్టులో అత్యంత విధ్వంసక బ్యాటర్‌లు ఉన్నారు. అందువల్ల ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన జట్టుగా ఆర్సీబీ రికార్డు సృష్టించింది. ఆర్సీబీ బ్యాటర్లు ఐపీఎల్ లో మొత్తం 16 సెంచరీలు సాధించారు. వీటిలో క్రిస్ గేల్ 5, విరాట్ కోహ్లి 6 సెంచరీలు ఉన్నాయి. ఎబి డివిలియర్స్ 2 సెంచరీలు చేశారు. దేవదత్ పడిక్కల్, మనీష్ పాండే, రజత్ పాటిదార్ మిగతా ముగ్గురూ తలో సెంచరీ చేశారు.
5. IPL ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్(973 ):

ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ చాలా రికార్డులను కలిగి ఉన్నాడు. వాటిలో ఒక సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా రికార్డు సృష్టించాడు. 2016 ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో పాటుగా  ఆ సీజన్‌లో ఆడిన16 ఇన్నింగ్స్‌ల్లో 973 పరుగులు చేశాడు. ఆర్సీబీ జట్టు ఫైనల్‌కు వెళ్ళేలా చేయగలిగాడు. విరాట్ కోహ్లీ 81.08 సగటుతో 152.03 స్ట్రైక్ రేట్‌తో 973 పరుగులు చేశాడు. ఆ సీజన్‌లో కోహ్లీ 4 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు చేశాడు.
6. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (17)

అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు మాత్రమే కాకుండా ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు ఆర్‌సీబీ బ్యాటర్‌దే. 2016 ఐపీఎల్‌ సీజన్‌లో పూణే జట్టు పై క్రిస్ గేల్ అత్యధిక ఐపీఎల్‌ వ్యక్తిగత స్కోరు 175 చేసి నాటౌట్‌ గా నిలిచారు. ఆ ఇన్నింగ్స్‌లో క్రిస్ గేల్ 17 సిక్సర్లను కొట్టి రికార్డ్ సృష్టించాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా ఇప్పటికీ ఆ రికార్డ్ క్రిస్ గేల్ పేరుమీదనే ఉంది. ఐపీఎల్‌ T20 ఇన్నింగ్స్‌లలో విధ్వంసక ఇన్నింగ్స్ లో ఒకరిగా నిలిచాడు.7. ఒకే ఫ్రాంచైజీకి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్ (237)

ఐపీఎల్‌లో ఒకే జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు  కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోసం 237 మ్యాచ్ లు ఆడారు.
అంతేకాకుండా 2008లో ఐపీఎల్‌ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు అదే జట్టుకు ఆడిన ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ. 15 ఏళ్ల నుండి కోహ్లీ ఆర్సీబీ ఐపీఎల్‌లో ప్రతి సీజన్ లో ఆడాడు. కోహ్లి కనిపించినంతగా మరే ఇతర ఆటగాడు అదే జట్టులో కనిపించలేదు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 204 మ్యాచ్‌లు ఆడిన మహేంద్ర సింగ్ ధోని రెండవ స్థానంలో ఉన్నాడు.

Also Read: ఒకప్పుడు రికార్డుల మీద రికార్డులు కొట్టిన వీరుడు… ఇప్పుడు డక్ అవుట్లు కొడుతున్నాడు..! ఏమైంది ఇతనికి..?


You may also like