Ads
ఇండియన్ క్రికెట్ టీమ్ లో చోటు కోసం ప్రతి ఒక్క ఆటగాడు ఎంతో శ్రమిస్తూ ఉంటాడు. నిలకడగా ప్రదర్శిస్తే తప్ప టీం లో చోటు ఫిక్స్ కాదు. ప్రస్తుతం బీసీసీఐ కాంట్రాక్ట్ ఇచ్చిన ఇండియన్ క్రికెటర్లు 30 మంది పైబడే ఉన్నారు. వారిలో ఏ సిరీస్ కి సెలెక్ట్ చేసిన 15 మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. మిగతా 15 మంది టీం లో చోటు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ లోపు ఇండియాలోనే స్టేట్ టీమ్స్ లో మంచి ప్రదర్శన కనబరుస్తూ సెలక్టర్ దృష్టిలో పడాలని ఆరాటపడుతుంటారు.
Video Advertisement
ప్రస్తుతం వరల్డ్ కప్ ఆడుతున్న ఇండియన్ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. అలాగే బెంచ్ మీద ఉన్న వారు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. ఇప్పుడు ఏదైనా కీలకమైన సీరియస్ లకి కొత్తగా టీం సెలెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది.
వీరిలో ఎవరినీ తప్పించడానికి మేనేజ్ మెంట్ సాహసం చేయదు. అలాంటిది ఇప్పుడు ఇండియన్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ కి ఇండియన్ టీం లో చోటు దక్కుతుందా లేదా అనేది అనుమానంగా మారింది. గత సంవత్సరం జరిగిన ఏక్సిడెంట్ కారణంగా రిషబ్ పంత్ విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసింది.అయితే ఇప్పుడిప్పుడే కొలుకొని మళ్ళీ ఫామ్ లోకి వస్తున్నాడు.ఇలాంటి సమయంలో రిషబ్ పంత్ మళ్లీ తిరిగి ఇండియన్ టీం లోకి రావడం అనేది కష్టంగా కనిపిస్తుంది.
ఎందుకంటే వికెట్ కీపర్ గా కె.ఎల్ రాహుల్ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతనికి వేరే ఆప్షన్ గా ఇషాన్ కిషన్ కూడా సిద్ధంగా ఉన్నాడు.అయితే బ్యాటింగ్ లెక్కన చూసుకుంటే ఇండియన్ మిడిల్ ఆర్డర్ కూడా బాగా స్ట్రాంగ్ గా ఉంది.ఇప్పుడు వారిని కాదని రషబ్ పంత్ కి చోటు దక్కాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ టీం లో ఎవరైనా గాయపడి రెస్ట్ తీసుకున్న లేదా వికెట్ కీపర్ కి ఎవరికైనా గాయమైన ఇటువంటి సందర్భంలో రిషబ్ పంత్ కి చోటు దక్కే అవకాశం ఉంది. ఒకసారి టీం లో నుండి బయటికి వెళ్లిన వారు మళ్ళీ టీంలో చోటు సంపాదించడం ఆషామాషీ విషయం కాదు. ముందు ముందు ఇండియన్ టీం ఆడే సిరీస్ లకి రిషబ్ పంత్ కి ఏదైనా అవకాశం దక్కుతుందేమో వేచి చూడాలి…!
Also Read:టీం ఇండియాకి ఉన్న అతి పెద్ద టెన్షన్ ఇదేనా..? ఈ ఒక్క లోటు తీరితే కప్ కొట్టినట్టే..!
End of Article