అంత మంచి ఫామ్‌లో ఉన్న “సూర్య కుమార్ యాదవ్” ని ఆడించకపోవడానికి కారణం అదేనా? రోహిత్ పెద్ద ప్లానే వేసాడుగా?

అంత మంచి ఫామ్‌లో ఉన్న “సూర్య కుమార్ యాదవ్” ని ఆడించకపోవడానికి కారణం అదేనా? రోహిత్ పెద్ద ప్లానే వేసాడుగా?

by Anudeep

Ads

దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సొంతం చేసుకుంది. సౌతాఫ్రికాతో గౌహతి వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ 16 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 237 పరుగుల భారీ స్కోరు చేసింది.

Video Advertisement

సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 61; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) సునామీ ఇన్నింగ్స్ ఆడాడు.సూర్యకుమార్ తో పాటు కేఎల్ రాహుల్ (28 బంతుల్లో 57; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (28 బంతుల్లో 49; 7 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ శర్మ (37 బంతుల్లో 43; 7 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించారు. చివర్లో దినేశ్ కార్తీక్ (7 బంతుల్లో 17; 1 ఫోర్, 2 సిక్సర్లు) సూపర్ ఫినిష్ ఇచ్చాడు.

rohit sharma comments on surya kumar yadav performance
మరోవైపు విజయం కోసం సౌతాఫ్రికా చివరి వరకు పోరాడింది. డేవిడ్ మిల్లర్ (106 నాటౌట్) శతకంతో దాదాపుగా ఓడించేంత పని చేశాడు. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగిన పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

rohit sharma comments on surya kumar yadav performance
పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో రోహిత్ శర్మ భారత బౌలింగ్ మెరుగు పడాల్సి ఉందని వ్యాఖ్యానించాడు. అదే సమయంలో భారత బ్యాటింగ్ ను ఆకాశానికి ఎత్తేశాడు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ పై ప్రశంసల జల్లు కురిపించాడు.అయితే ఇక్కడే సూర్యకుమార్ యాదవ్ గురించి ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. సూర్యకుమార్‌ యాదవ్ ఆడిన తీరును మెచ్చుకున్న రోహిత్.. ఇకపై సూర్యకుమార్‌ను ఆడించాలని అనుకోవడం లేదని, అతన్ని నేరుగా అక్టోబర్‌ 23వ తేదీన బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు రోహిత్‌ పేర్కొన్నాడు.

rohit sharma comments on surya kumar yadav performance
పిచ్, మ్యాచ్‌ సిచ్యూవేషన్‌తో సంబంధంలేని ఆట తీరుతో సూర్యకుమార్‌ అదరగొడుతున్నాడు. మిగతా జట్టు మొత్తం పిచ్‌ వల్ల ఇబ్బంది పడుతున్నా, వెంట వెంటనే వికెట్లు కోల్పోయినా.. ప్రత్యర్థి బౌలర్లు మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేసినా.. ఇవేవి సూర్య బ్యాటింగ్‌పై ప్రభావం చూపడం లేదు. అందుకే టీ20 వరల్డ్‌లో సూర్య నేరుగా వచ్చి అదరగొట్టాలని రోహిత్‌ భావన.

rohit sharma comments on surya kumar yadav performance
అయితే వన్డే సిరీస్ కు సూర్యతో పాటు టి20 ప్రపంచకప్ కు ఎంపికైన చాలా మంది ప్లేయర్లు దూరంగా ఉన్నారు. ఇక రెండు వార్మప్ మ్యాచ్ లు ఉన్నాయి.సూర్యకుమార్ యాదవ్ ను నేరుగా పాకిస్తాన్ తో 23న జరిగే మ్యాచ్ లో ఆడిస్తామనేది అనాలోచిత నిర్ణయమనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడి పిచ్ లకు ఆస్ట్రేలియా పిచ్ లకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అంతేకాకుండా ఫామ్ లో పీక్స్ లో ఉన్న ప్లేయర్ ను పక్కన బెట్టడం మంచిది కాదు. దాని వల్ల అతడి రిథమ్ దెబ్బ తింటుంది.

rohit sharma comments on surya kumar yadav performance
ఆసియా కప్ లో పాకిస్తాన్ పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన పాండ్యాను ఆ తర్వాత హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో ఆడించలేదు. ఇక సూపర్ 4లో మళ్లీ జట్టులోకి వచ్చిన అతడు ఫ్లాప్ షో కనబరిచాడు. ఫామ్ లో ఉన్న ప్లేయర్ ను పక్కన బెట్టడం ఎప్పుడూ మంచిది కాదనే విషయాన్ని రోహిత్ గుర్తించుకోవాలి అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.


End of Article

You may also like