Ads
క్రికెట్ వరల్డ్ కప్ లో టీమిండియా ప్రదర్శన అద్భుతంగా ఉంది. టీం ఆల్రౌండర్ ప్రదర్శనతో విజయాలు నమోదు చేసుకుంది. దాదాపు సేమిస్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకున్న టీం మిగిలిన మ్యాచ్లను కూడా గెలిచి టేబుల్ లో టాప్ ప్లేస్ లో నిలబడటానికి ప్రయత్నిస్తుంది. అయితే ఒకపక్క టీం విజయాలు సాధిస్తుందని ఆనందపడాలా లేక టీం లో ఆటగాళ్లు గాయాలతో దూరమవుతున్నారని బాధపడాల అనేది సగటు అభిమానులకు అర్థం కావడం లేదు.
Video Advertisement
బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గాయం కారణంగా ఇప్పటికే ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టీమ్ కి దూరమయ్యాడు. ఇది టీం కి కోలుకోలేని దెబ్బ. అయితే దీని నుంచి తేరుకోక ముందే భారత అభిమానులకు మరో బిగ్ షాక్ తగలనుంది.
డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ కి ముందు టీమిండియా శనివారం నెట్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉంది. అయితే ఈ ప్రాక్టీస్ లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. ఈ కారణంగా హిట్ మాన్ ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో ఆడతాడా లేదా అనే దానిపైన అనుమానాలు నెలకొన్నాయి. దీంతో అభిమానుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.శనివారం నెట్స్ లో రోహిత్ శర్మ తీవ్రంగా శ్రమించాడు. అయితే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బౌలర్ విసిరిన బంతి హిట్ మ్యాన్ మణికట్టుకు బలంగా తగిలింది. దీంతో రోహిత్ నొప్పితో బాధపడినట్లుగా తెలుస్తుంది.
వెంటనే ఫిజియో వచ్చి రోహిత్ గాయని పరిశీలించాడు. తర్వాత రోహిత్ మళ్లీ ప్రాక్టీస్ కి రాలేదు. అయితే గాయం ఎంత తీవ్రంగా ఉంది అనే దాని పైన స్పష్టత లేదు. బీసీసీఐ కూడా రోహిత్ శర్మ గాయం పై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ విషయం పైన సందిగ్ధత నెలకొంది. ఒకవేళ గాయ తీవ్రత ఎక్కువగా ఉంటే ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో రోహిత్ బరిలో దిగి అవకాశం లేదు. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఆడకపోతే భారత జట్టుకు పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పుకోవాలి.
Also Read:ఇంగ్లాండ్ తో మ్యాచ్ కి “రోహిత్” మాస్టర్ ప్లాన్…షమీ, అశ్విన్ ఎవరి స్థానాల్లో ఆడతారంటే.?
End of Article