బిగ్ ట్విస్ట్ : రోహిత్ కి కెప్టెన్సీ లేనట్టేనా ? అసలు కారణం ఏంటంటే..

బిగ్ ట్విస్ట్ : రోహిత్ కి కెప్టెన్సీ లేనట్టేనా ? అసలు కారణం ఏంటంటే..

by Anudeep

Ads

ప్లే ఆఫ్స్ లోనుంచి ముంబై వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ జట్టు దాదాపు ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది. కానీ, ఈ సారి ప్లే ఆఫ్స్ కి కూడా క్వాలిఫై కాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ ప్రభావం రోహిత్ శర్మపై పడే అవకాశమే ఎక్కువ ఉందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.

Video Advertisement

త్వరలోనే టీం ఇండియా కెప్టెన్ గా పగ్గాలు అందుకునే రేసులో ఉన్నాడు రోహిత్ శర్మ. కానీ, ఈ ఏడాది ఐపీఎల్ అతనికి ఓ చేదు జ్ఞాపకాన్ని మిగిల్చినట్లయింది. ముంబై ఇండియన్స్ జట్టుని సమర్ధవంతంగా నడిపిన అతని శక్తియుక్తుల్ని చూసే ఈసారి అతనికి కెప్టెన్సీ ఇవ్వాలని బీసీసీఐ భావించింది. కానీ, ఈ ఏడాది ఇలా జరగడం తో రోహిత్ కి కెప్టెన్సీ లేనట్టేనా అంటూ క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు కొందరు ఈ వైఫల్యాన్ని రోహిత్ పైనే మోపడం సరికాదని, గతం లో ఐదుసార్లు టైటిల్ గెల్చుకున్న విషయాన్నీ మర్చిపోవద్దని వాదిస్తున్నారు.

అయితే ఈసారి టీమ్ ఇండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తర్వాత ఒక ఒక యువ నాయకత్వం ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు. అందుకోసం రిషబ్ పంత్ పంత్ మంచి ఛాయిస్ అని అనుకుంటున్నట్లు సమాచారం. శ్రేయస్ అయ్యర్ గాయపడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పగ్గాలందుకున్న రిషబ్ పంత్, టీంని అద్భుతంగా ముందుకు నడిపించారు. దీంతో రోహిత్ తో పాటు టీమ్ ఇండియా టి20 జట్టు కెప్టెన్‌గా రిషబ్ పంత్ పేరు కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ సీజన్‌లో కెప్టెన్‌గా రోహిత్ నిరాశపరచడంతో రిషబ్ పంత్‌కి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బోర్డ్ ఎవర్ని సెలెక్ట్ చేస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.


End of Article

You may also like