భర్తతో వీడియో కాల్ లో ఉండగా దూసుకొచ్చిన రాకెట్… తొమ్మిది సంవత్సరాల కొడుకు తల్లి లేని వాడయ్యాడు.!

భర్తతో వీడియో కాల్ లో ఉండగా దూసుకొచ్చిన రాకెట్… తొమ్మిది సంవత్సరాల కొడుకు తల్లి లేని వాడయ్యాడు.!

by Mohana Priya

Ads

ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరిగిన గొడవల్లో ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఇజ్రాయెల్ రాజధాని అయిన జెరూసలెంలో గత కొద్దిరోజులుగా యుద్ధ వాతావరణం నెలకొంది. పాలస్తీనాలో గాజూ కి చెందిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై రాకెట్ దాడులకు పాల్పడుతున్నారు. దీనికి ఇజ్రాయిల్ గాజూ పై బాంబుల దాడికి పాల్పడుతున్నారు.

Video Advertisement

soumya santosh israel

ఈ దాడిలో ఇప్పటివరకు దాదాపు 28 మంది పాలస్తీనియన్లు తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ దాడుల్లో మరణించిన వారిలో 16 మంది ఉగ్రవాదులు అని ఇజ్రాయేల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడుల్లో మరణించిన వారిలో ఒక భారతీయ మహిళ కూడా ఉన్నారు. కేరళలోని ఇడుక్కి జిల్లా కీరితోడు కి చెందిన ఎమ్మెస్ సౌమ్య గత ఏడు సంవత్సరాలుగా ఇజ్రాయిల్ లోని అష్కెన్ నగరంలో హౌస్ హెల్పర్ గా పని చేస్తున్నారు.

soumya santosh israel

పాలస్తీనా జరిపిన రాకెట్ దాడిలో సౌమ్య తన ప్రాణాలను కోల్పోయినట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అష్కెన్ లో ఉన్న తన నివాసంలో సౌమ్య తన భర్త సంతోష్ తో వీడియో కాల్ మాట్లాడుతుండగా పాలస్తీనా ఉగ్రవాదులు వదిలిన రాకెట్ సౌమ్య ఇంట్లో పడి పేలింది.

soumya santosh israel

ఈ సంఘటనలో సౌమ్య ప్రాణాలను కోల్పోయారు. సౌమ్య మరణం పట్ల ఇజ్రాయెల్ రాయబారి రాన్ మల్కా సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ ప్రభుత్వం తరఫున సౌమ్య కుటుంబంతో మాట్లాడాను అని చెప్పారు. సౌమ్య మృతికి దేశం అంతా చింతిస్తోంది అని అన్నారు.

soumya santosh israel

అలాగే సౌమ్య సంతోష్ ల తొమ్మిది సంవత్సరాల కొడుకు అడోన్ గురించి కూడా తన ట్విట్టర్ లో చెప్పారు రాన్ మల్కా. తనని చూస్తుంటే 2008 లో ముంబై దాడిలో తన తల్లిదండ్రులను కోల్పోయిన మోసెస్ గుర్తుకు వచ్చాడు అని చెప్పారు. అంతే కాకుండా సౌమ్య కుటుంబం యొక్క ఫోటోలను కూడా పోస్ట్ చేశారు.

 


End of Article

You may also like