సమంత, నాగ చైతన్య గురించి ప్రస్తుతం ఎన్నో పుకార్లు వస్తున్నాయి. వారు ఇద్దరూ విడిపోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. సమంత కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఇంటి పేరు తీసేయడం, ఈ విషయంపై ఇంటర్వ్యూలో అడిగినా కూడా, “నేను సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి స్పందిస్తాను” అని చెప్పడం, ఇంకా చర్చలకు దారి తీస్తున్నాయి.

times of india whatsapp chat with samantha about divorce

సమంత గత కొంత కాలం నుండి టూర్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక్క రోజు కోసం హైదరాబాద్ కి వచ్చారు. సమంత, నాగ చైతన్య విడాకుల వరకు వెళ్లారు అని, ఆ కౌన్సిలింగ్ కోసమే సమంత హైదరాబాద్ కి వచ్చారు అనే వార్త గట్టిగా వినిపిస్తోంది. సమంత పెళ్లి అయిన తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో తన ఇంట్లో వారికి ఎక్కువ సమయం కేటాయించడం లేదు అని కుటుంబ సభ్యులు భావించినట్టు, ఇదే విషయంపై సమంత, నాగ చైతన్య మధ్య గొడవ జరిగి, ఆ గొడవ విడాకుల వరకు వెళ్ళినట్టు సమాచారం.times of india whatsapp chat with samantha about divorce

ఇదిలా ఉండగా, అక్కినేని నాగార్జున కూడా ఈ విషయాలపై మాట్లాడాల్సి వస్తుంది ఏమో అని బిగ్ బాస్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేశారు అనే వార్త కూడా వచ్చింది. ఇవి మాత్రమే కాకుండా నాగార్జున బర్త్ డే పార్టీ కి సమంత హాజరు అవ్వకపోవడం, సమంత ఇంస్టాగ్రామ్ స్టోరీస్ కూడా పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఈ విషయంపై అయితే అక్కినేని కుటుంబం అసలు స్పందించడం లేదు.