ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కొన్ని విషయాలు అయిన క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఇక ట్రోలింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోల సినిమాల దగ్గర నుండి బుల్లితెర సీరియల్స్ వరకు ట్రోలింగ్ కు గురి అవుతున్నాయి. ఒకప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అందుబాటులో లేకపోవడంతో అవి ప్రసారం అయినపుడు మాత్రమే చూసే వెసులుబాటు ఉండేది.

Video Advertisement

కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు.సినిమాలు థియేటర్ రన్ ముగియక ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. దాంతో మళ్ళీ మళ్ళీ చూసే అవకాశం ఉండడడంతో వాటిలోని మిస్టేక్స్ ను కనిపెట్టడమే కాకుండా నెట్టింట్లోనూ షేర్ చేయడంతో ఆయా డైరెక్టర్స్, నటుల పై ట్రోల్స్ చేస్తున్నారు. దీనికి బుల్లితెర అతీతం కాదు. ఇప్పుడు దాదాపుగా అన్ని  సీరియల్స్, ప్రోగ్రామ్స్ కూడా ఓటీటీలో ప్రసారం అవుతున్నాయి. దాంతో వాటిలో చిన్న తప్పులు దొర్లినా, అసహజంగా ఉన్నా దానికి సంబంధించిన క్లిపింగ్స్ ను నెట్టింట్లో షేర్ చేయడంతో అవి కూడా ట్రోలింగ్ బారిన పడుతున్నాయి.
divya-drishti-seria2ఇటీవల దివ్య దృష్టి అనే హిందీ సీరియల్ కి సంబంధించిన క్లిపింగ్ ను షేర్ చేయడంతో సామాజిక మధ్యమాలలో దాని పై కామెంట్స్  చేస్తున్నారు. దివ్య దృష్టి అనే సీరియల్ స్టార్ ప్లస్ లో ప్రసారం అవుతోంది. ఈ సీరియల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కింది. ఇది ఒక అక్కాచెల్లెల్ల కథగా చెప్పవచ్చు. దివ్య, దృష్టి అనే ఇద్దరు విడిపోయిన అక్కాచెల్లెల్లు అతీంద్రియ శక్తులను కలిగి ఉంటారు. వీరిలో ఒకరు తన మూడవ నేత్రంతో భవిష్యత్తును చూడగలరు. వేర్వేరు కుటుంబాలతో దత్తత తీసుకున్నారు.
divya-drishti-seria1వీరిని వెంటాడే శత్రువు మధ్య జరిగే ఈ సీరియల్ మొదట్లోచాలా ఆసక్తిగా ఉన్నప్పటికి రాను రాను ఆ ముగ్గురి మధ్య వచ్చే అంతులేని గోడవలతో ఆడియెన్స్ కి సహనానికి పరీక్షలా మారుతోంది. ఈ క్రమంలో ఈ సీరియల్ లోని ఒక సీన్  ని నెట్టింట్లో షేర్ చేయడంతో నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఆ సన్నివేశంలో పై నుండి కింద పడిపోతున్న హీరోయిన్ ను అప్పటి దాకా ఆమె పక్కనే ఉన్న అతను వేగంగా వచ్చి కిందపడకుండా పట్టుకుంటాడు. అది కూడా అతను మెట్లు దిగి వస్తాడు. ఎంత వేగంగా వచ్చినా కూడా నిజ జీవితంలో అయితే అలా చేయలేరు. దాంతో ఈ సీరియల్ లో అతను ఫాస్ట్ గా వచ్చి ఆమెను పడిపోకుండా పట్టుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డ్స్ కి పంపించండి అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ సీరియల్ లో దివ్య మరియు దృష్టి పాత్రలలో సనా సయ్యద్ మరియు ప్రకృతి నౌటియల్ నటించారు. ఈ సీరియల్ హాట్‌స్టార్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

watch video :

Also Read:ఇలాంటివి మన “సీరియల్స్” లో మాత్రమే జరుగుతాయి అనుకుంటా..? ఈ సీన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!