ఒక్కోసారి సీరియల్ వాళ్ళు చేసే అతి చూస్తే నవ్వు ఆగదు. అసలు ఎందుకు అలాంటి సన్నివేశాలను చేస్తారో వాళ్ళ కైనా అర్థమవుతుందా అనిపిస్తుంది. సీరియల్ లో చేసే అతికి చూసే ప్రేక్షకుల మతి పోతుంది. వాళ్ల నటన వెండితెర నటుల నటనను మించి ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ మధ్య కొన్ని సీరియల్స్ లో కొన్ని సన్నివేశాలు ఇష్టారీతిన తీస్తూ ట్రోల్స్ కి గురవుతున్నారు మేకర్స్..

Video Advertisement

అయితే సీరియల్స్ ని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఇందులో చాలా వరకు ప్రేక్షకులకు నచ్చుతున్నాయి కూడా. దాంతో వీటి పాపులారిటీ సోషల్ మీడియా వరకూ పాకింది. అయితే ఈ మద్య కాలం లో సీరియల్స్ ని లాజిక్స్ కి దూరంగా.. తెలివి లేకుండా తీస్తున్నారు. వీటిని చూస్తున్న నెటిజన్లు వాటిని ట్రోల్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. చాలా సీరియల్స్ లోని సీన్లు రియాలిటీ కి దూరంగా ఉంటూ నెట్టింట ట్రోలింగ్ కి గురవుతున్నాయి.

trolls on gundamma katha serial..!!

ఇంతకు ముందు ఇటువంటి వాటిని జనాలు పట్టించుకొనే వారు కాదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రాభవం పెరగడం తో ఇటువంటి సీన్ల పై ట్రోల్స్ పెరుగుతున్నాయి. జీ తెలుగులో గుండమ్మ కథ అనే సీరియల్ వస్తోంది. ఈ సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 1: 30 గంటలకు జీ తెలుగులో ప్రసారం అవుతుంది. ఈ సీరియల్ లో గీత, రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 1000 కి పైగా ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ సీరియల్ లో ప్రస్తుతం కూడా తరం నడుస్తోంది.

trolls on gundamma katha serial..!!

తాజాగా ఆ సీరియల్ లో గుండమ్మ పాత్రలో హర్షల నటిస్తున్నారు. అయితే తాజాగా ప్రసారం అయిన ఒక ఎపిసోడ్ లో గుండమ్మ హీరో మున్నా ని భయపెట్టేందుకు.. ఒక రకం గా ప్రవర్తిస్తూ.. కాంతారి ని రా అంటుంది. గతేడాది సూపర్ హిట్ గా నిలిచిన కాంతారా చిత్రాన్ని పోలినట్టు ఈ సీన్ ని చేసారు. దీంతో నెటిజన్లు ఈ సీరియల్ ని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు ఇటువంటి సీరియల్స్ తీస్తున్నారు అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంతారా వంటి గొప్ప చిత్రాన్ని కూడా ఈ సీరియల్స్ లో కామెడీ కోసం వాడకుంటున్నారు అంటూ ఫాన్స్ వాపోతున్నారు.

watch video :