ఈ “సీరియల్” అవతార్ ని మించిపోయింది అనుకుంటా..! ఈ సీన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..?

ఈ “సీరియల్” అవతార్ ని మించిపోయింది అనుకుంటా..! ఈ సీన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..?

by Anudeep

Ads

టీవీ ల్లో అన్నిటికంటే ఎక్కువగా ఫేమస్ అయినవి ఏంటి అంటే అవి సీరియల్స్ మాత్రమే..ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో వేల సీరియల్స్ వచ్చాయి.. వస్తున్నాయి కూడా. ఇందులో కొన్ని డబ్బింగ్ సీరియల్స్ ఉంటాయి.. కొన్ని రీమేక్ సీరియల్స్ ఉంటాయి. వీటన్నిటిని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఇందులో చాలా వరకు ప్రేక్షకులకు నచ్చుతున్నాయి కూడా. దాంతో వీటి పాపులారిటీ సోషల్ మీడియా వరకూ పాకింది.

Video Advertisement

అయితే ఈ మద్య కాలం లో సీరియల్స్ ని లాజిక్స్ కి దూరంగా.. తెలివి లేకుండా తీస్తున్నారు. వీటిని చూస్తున్న నెటిజన్లు వాటిని వైరల్ చేస్తున్నారు. దీంతో చాలా సీరియల్స్ లోని సీన్లు రియాలిటీ కి దూరంగా ఉంటూ నెట్టింట ట్రోలింగ్ కి గురవుతున్నాయి. తాజాగా ఒక హిందీ సీరియల్ లో హీరోయిన్ ని హీరో కాపాడే సీన్ వైరల్ గా మారింది. దంగల్ టీవీ ఛానల్ లో ‘ ఇష్క్ కీ దస్తాన్ నాగమణి’ అనే హిందీ సీరియల్ వస్తోంది. ఇదొక నాగిని సీరియల్.

trolls on hindi serial..!!

ఇందులో ఒక సీన్ లో హీరోయిన్ ని పాము కాటు వెయ్యడం వల్ల తన శరీరం మొత్తం విషమయం అయ్యి.. నీలం రంగులోకి మారిపోతుంది. దీంతో వెంటనే హీరో అతడి నోటితో ఆమె శరీరం లోని విషాన్ని మొత్తం లాగేస్తాడు. దీంతో అతడి శరీరం నీలం రంగులోకి మారుతుంది. ఇది చూసిన నెటిజన్లు పలు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇండియన్ అవతార్..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే ప్రస్తుతం అన్ని సీరియల్స్ లోను ఇటువంటి లాజిక్ లెస్ సీన్స్ తీస్తున్నారంటూ మరికొందరు విమర్శిస్తున్నారు.

trolls on hindi serial..!!

ఇంతకు ముందు కూడా ఇదే సీరియల్ లోని మరో సీన్ కూడా వైరల్ గా మారి.. ట్రోల్స్ కి గురైంది. ఆ సీన్ లో హీరో గాలిపటం ఎగరేస్తూ ఉన్నప్పుడు విలన్ ఆ దారాన్ని కత్తిరిస్తాడు. దీంతో హీరో పడిపోతాడు. అప్పుడు హీరోయిన్ ఆ గాలిపటాన్ని పట్టుకొని.. దాని సహాయం తో ఎగురుతూ హీరో ని రక్షిస్తుంది. ఈ సీన్ పై కూడా నెటిజన్స్ ట్రోలింగ్ చేసారు. ఇప్పుడు మరోసారి కూడా ఇలాంటి సీన్స్ తీసి వైరల్ చేస్తున్నారు.

watch video:

https://www.instagram.com/reel/Cn8ZywyJiWl/?igshid=YmMyMTA2M2Y%3D


End of Article

You may also like