టీవీల్లో అన్నిటికంటే ఎక్కువగా ఫేమస్ అయినవి ఏంటి అంటే అవి సీరియల్స్ మాత్రమే..ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో వేల సీరియల్స్ వచ్చాయి.. వస్తున్నాయి కూడా. ఇందులో కొన్ని డబ్బింగ్ సీరియల్స్ ఉంటాయి.. కొన్ని రీమేక్ సీరియల్స్ ఉంటాయి. వీటన్నిటిని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు.

Video Advertisement

అయితే కొన్ని సార్లు మాత్రం ఒక్కోసారి సీరియల్ వాళ్ళు చేసే అతి చూస్తే నవ్వు ఆగదు. అసలు ఎందుకు అలాంటి సన్నివేశాలను చేస్తారో వాళ్ళ కైనా అర్థమవుతుందా అనిపిస్తుంది. ఈ మధ్య కొన్ని సీరియల్స్ లో కొన్ని సన్నివేశాలు ఇష్టారీతిన తీస్తూ ట్రోల్స్ కి గురవుతున్నారు మేకర్స్. చాలా సీరియల్స్ లోని సీన్లు రియాలిటీ కి దూరంగా ఉంటూ నెట్టింట ట్రోలింగ్ కి గురవుతున్నాయి.

telugu serial copied scene from venkatesh movie..

స్టార్ మా ఛానెల్ లో 2021 నుంచి ‘ఇంటికి దీపం ఇల్లాలు’ సీరియల్ వస్తోంది. ఈ సీరియల్ హిందీ టెలివిజన్ సిరీస్ సాథ్ నిభానా సాథియాకు రీమేక్. ఆ సీరియల్ తెలుగులో కూడా కొన్ని రోజులు ప్రసారం అయ్యింది. అయితే ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ లో ధన్య దీపిక కృష్ణ ప్రియ పాత్రలో నటిస్తోంది. ఈ సీరియల్ లో ఈమె పాత్ర అమాయకంగా ఉంటుంది. ఆమె చదువు కోలేదు. అందుకే ఆమె సవతి తల్లి ఇందుమతి ఆమెను రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

telugu serial copied scene from venkatesh movie..

అయితే తాజాగా జరిగిన ఒక ఎపిసోడ్ లో దమయంతి కృష్ణ ని ఒక లక్ష రూపాయలు అడుగుతుంది. అప్పుడు కృష్ణ తన చెక్ బుక్ లో 10 అంకె వేసి.. సైన్ చేసి ఇస్తుంది. లక్ష రూపాయలు అడిగితే..10 రూపాయలే ఇచ్చావేంటి అని అడుగుతుంది. దానికి కృష్ణ..”5 లక్షలకి 5 సున్నాలు అని చెప్పారుగా పిన్ని.. అలాగే ఒక లక్షకి 1 సున్నానే కదా..” అని బదులిస్తుంది. ఈ సీన్ చూసిన నెటిజన్లు ఇది ఎక్కడో చూసినట్టు ఉందే అని కామెంట్స్ చేస్తున్నారు.

telugu serial copied scene from venkatesh movie..

వెంకటేష్ నటించిన సూపర్ హిట్ మూవీ అబ్బాయి గారు చిత్రం లో ఇటువంటి సీనే ఉంటుంది. కొడుకు ఆస్తిపై కన్నేసిన వెంకటేష్ సవతి తల్లి.. అతడికి లోకజ్ఞానం లేకుండా.. చదువుకోకుండా పెంచుతుంది. ఆమె అన్నయ్య కోట శ్రీనివాస రావు కూడా అక్కడే ఉండి వెంకటేష్ దగ్గర డబ్బులు దోచుకుంటూ ఉంటాడు.

ఈ నేపథ్యం లో ఒకసారి నాలుగు వేలు కావాలి అని చెప్పి.. వెయ్యికి ఒక సున్నా వస్తుంది.. అందుకే నాలుగు సున్నాలు పెట్టాలి అని చెప్తాడు. ఆ తర్వాత ఒక వెయ్యి కావాలని అడగ్గా వెంకటేష్ 10 అంకె వేసి ఇస్తాడు. ఇప్పుడు సేమ్ ఈ సీన్ ని ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ లో పెట్టడం తో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు బీజియం లే అనుకున్నాం..ఇప్పుడూ సీన్లు కూడా కాపీ చేస్తున్నారా అంటూ ట్రోల్ చేస్తున్నారు.

watch video: