“నువ్వే కదా అప్పుడు ఆ తప్పు చేసింది..?” అంటూ… “ధోని” పై సెహ్వాగ్ కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

“నువ్వే కదా అప్పుడు ఆ తప్పు చేసింది..?” అంటూ… “ధోని” పై సెహ్వాగ్ కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

by kavitha

Ads

భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్  తాజాగా మహేంద్ర సింగ్ ధోని పై విమర్శలు చేశాడు. అజింక్య రహానే గురించి ప్రశ్నలను సంధించాడు. రహానేను భారత జట్టుకు ధోనీ ఆడే సమయంలో తుది జట్టులోకి ఎందుకు తీసుకోలేదని నిలదీశాడు. సెహ్వాగ్ ఎందుకు ధోనిని విమర్శించాడు అనేది ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

ఐపీఎల్ 16 వ సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్‌ జట్టుతో శనివారం జరిగిన మ్యాచ్‌లో ధోనీ రహానేకు అవకాశం ఇచ్చాడు. ఇక ఈ మ్యాచ్ లో అజింక్య రహానే కేవలం 19 బంతుల్లో 50 పరుగులు చేసి, చెన్నై సూపర్ కింగ్స్ జటూ గెలుపులో కీలక పాత్రను పోషించాడు. ధోనీ రహానే ఆటతీరు పై సంతోషం వ్యక్తం చేశాడు. మ్యాచ్ తరువాత రహానే గురించి మాట్లాడుతూ అతని పై ప్రశంసలు కురిపించాడు.
sehwag-comments-dhoni1టోర్నీ మొదలయ్యే ముందు చెన్నై సూపర్ కింగ్స్ కోసం ప్రాక్టీస్ చేసే టైమ్ లో రహానే, నేను మాట్లాడుకున్నాం. అప్పుడు రహానే నాలో మీరు ఏం చూడాలనుకుంటున్నారని అడిగాడు. దాంతో నేను నీ బలానికి అనుగుణంగా ఆడమని సలహా ఇచ్చాను. అలాగే నువ్వు భారీ సిక్సర్లు కొట్టే స్థిరమైన ప్లేయర్ వీ కాదు. అయితే ఒత్తిడి లేకుండా ఆడమని, టెక్నికల్‌గా రహానే మంచి బ్యాటర్ అని సూచించినట్లు ధోనీ వెల్లడించాడు.
sehwag-comments-dhoniధోని చేసిన ఈ కామెంట్స్ పై వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహించాడు. అలాగే ధోనీ అభిమానులు సైతం రహానే ఇన్నింగ్స్ కి కూడా ధోనికే క్రెడిట్ ఇవ్వడం పై కూడా సెహ్వాగ్ అసహనం తెలిపాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై జట్టు ప్లేయర్స్ కి మద్దతు ఇస్తున్నట్లుగా మాట్లాడుతున్న ధోని, భారత జట్టులో ఉన్నప్పుడు ఇదే రహానేకు మద్దతు ఎందుకు ఇవ్వలేదని అడిగాడు.
sehwag-comments-dhoni3ధోనీ టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో జరిగిన వన్డేల్లో అజింక్య రహానేను పక్కన పెట్టాడని, అతను స్లో ప్లేయర్ అని, స్ట్రైక్ రొటేట్ చేయట్లేదని రహానేను టీమిండియా నుంచి తొలగించినట్లు సెహ్వాగ్ చెప్పారు. ఇక ఐపీఎల్‌ కోసం చెన్నై జట్టులో ఆడేందుకు అడ్డురాని రహానే స్ట్రైక్ రేట్. టీమిండియాకి ఆడేటపుడు మాత్రం అడ్డు వచ్చిందా అని ధోనిని ప్రశ్నించాడు. ఇప్పుడు మోటివేట్ చేసినట్టుగా, టీమిండియాకు ఆడేటపుడు రహానేను మోటివేట్ చేసి ఉంటే, అతను ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌ ఆడేవాడు అని సెహ్వాగ్ అన్నారు.
sehwag-comments-dhoni2Also Read: “ఇదెక్కడి దరిద్రం రా?” అంటూ… “లక్నో” పై RCB ఓడిపోవడంతో ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్స్..!


End of Article

You may also like