అప్పుడు ఉదయ్ కిరణ్…ఇప్పుడు సుశాంత్ సింగ్.! ఇద్దరి విషాదాల్లో ఉన్న పోలికలు ఇవే.!

అప్పుడు ఉదయ్ కిరణ్…ఇప్పుడు సుశాంత్ సింగ్.! ఇద్దరి విషాదాల్లో ఉన్న పోలికలు ఇవే.!

by Mohana Priya

Ads

సుశాంత్ మరణించి సంవత్సరం అవుతుంది.తెలుగు వాళ్ళందరికీ సుశాంత్ ని చూస్తే ఇలాగే హఠాత్తుగా మన మధ్య నుంచి వెళ్లిపోయిన మరొక యాక్టర్ గుర్తొస్తారు. ఆయనే ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ సుశాంత్ జీవితాలను గమనించి చూస్తే ఇద్దరికీ మధ్య కొన్ని పోలికలు కనిపిస్తాయి.

Video Advertisement

ఇద్దరివి మొదటి మూడు సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. ఉదయ్ కిరణ్ నటించిన చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే ఎంతో ప్రజాదరణ పొందాయి. అదేవిధంగా సుశాంత్ నటించిన కైపోఛే, శుధ్ దేశి రొమాన్స్, హీరో గా కాకపోయినా ముఖ్య పాత్రలో నటించిన పీకే చిత్రాలు కూడా హ్యాట్రిక్ విజయాన్ని సాధించాయి. అదేవిధంగా ఇద్దరి నాలుగో సినిమాలు అయిన కలుసుకోవాలని, డిటెక్టివ్ బ్యోమకేష్ భక్షి యావరేజ్ గా నిలిచాయి.

ఇద్దరు టీనేజ్ లోనే తమ కెరీర్ మొదలు పెట్టారు. కానీ సినిమాల్లో కాదు. ఉదయ్ కిరణ్ తను డిగ్రీ చదువుకునే రోజుల్లో మోడలింగ్ తో తన కెరీర్ మొదలు పెడితే, సుశాంత్ తను ఇంజనీరింగ్ జాయిన్ అయిన కొత్తలో షైమక్ ధావర్ దగ్గర డాన్స్ నేర్చుకుని ఫిలింఫేర్ లో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టాడు.

 

ఇద్దరికీ తమ తల్లుల తోనే ఎక్కువ అనుబంధం ఉంది. సుశాంత్ డిగ్రీ లో చేరే ముందు తన తల్లి మరణించారు. ఉదయ్ కిరణ్ సినిమా జీవితం మొదలుపెట్టిన తర్వాత మధ్యలో తన తల్లి మరణించారు. ఇద్దరు తల్లి మరణం తర్వాత డిప్రెషన్ కి గురయ్యారు.

 

ఇద్దరు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఆడిషన్స్ ద్వారా తమ మొదటి సినిమాల్లో సెలక్ట్ అయ్యారు. ఇద్దరూ తమ కెరీర్ ముగిసే లోపు చేసిన సినిమాల సంఖ్య 20 లోపే. సుశాంత్ 12 సినిమాలు చేస్తే అందులో 11 రిలీజ్ అయ్యాయి. ఉదయ్ కిరణ్ 19 సినిమాలు చేస్తే అందులో 18 రిలీజ్ అయ్యాయి. ఇతర కెరియర్ కాలం కూడా దాదాపు ఒకటే.

ఉదయ్ కిరణ్ కెరియర్ కాలం 13 ఏళ్లు. 2000 సంవత్సరం నుండి 2013 వరకు. 2009లో ఉదయ్ కిరణ్ నటించిన ఏ సినిమా విడుదల కాలేదు. ఆ విధంగా చూసుకుంటే 12 ఏళ్ళు. తను చనిపోయిన తర్వాత 2014లో చిత్రం చెప్పిన కథ అనే సినిమా పోస్టర్ విడుదల చేశారు కానీ సినిమా విడుదల చేయలేదు. సుశాంత్ కెరియర్ కాలం కూడా 12 ఏళ్లు. 2008లో కిస్ దేశ్ మే హై మేరా దిల్ సీరియల్ తో తన నటనా జీవితం ప్రారంభించాడు సుశాంత్.

ఇద్దరూ చనిపోయిన కారణం ఒకటే. డిప్రెషన్. ఉదయ్ కిరణ్ కి కెరీర్ పరంగా అయితే సుశాంత్ కి వ్యక్తిగత విషయాల పరంగా. ఇద్దరు ఉరేసుకుని చనిపోయారు. ఇంకొక విషయం ఏంటంటే ఇద్దరూ చనిపోయిన రోజు ఆదివారం కావడం. ఉదయ్ కిరణ్ చనిపోయింది 5 జనవరి 2014. ఆరోజు ఆదివారం.సుశాంత్ చనిపోయింది  14 జూన్ 2020. ఆదివారం.

 

చనిపోయే సమయానికి ఇద్దరి వయసు కూడా దగ్గర దగ్గర ఒకటే. ఉదయ్ కిరణ్ పుట్టినరోజు జూన్ తన చనిపోయింది జనవరిలో చనిపోయే సమయానికి 34 నిండలేదు కాబట్టి మరణించినప్పుడు ఉదయ్ కిరణ్ వయసు 33 సంవత్సరాలు. సుశాంత్ పుట్టింది జనవరిలో, చనిపోయింది జూన్ లో , చనిపోయే సమయానికి సుశాంత్ వయసు 34 సంవత్సరాలు.


End of Article

You may also like