Ads
ఐపీఎల్ లో భాగంగా ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఉప్పల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ జట్టు చేతిలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ లాంటి జట్లు ఓటమి పాలు అయ్యాయి. ఈ సీజన్ లో 250 కి పైగా మూడు స్కోర్లు చేసింది. ఇప్పుడు బెంగళూరు జట్టుతో 300 పరుగుల టార్గెట్ పెట్టుకుంది. హైదరాబాద్ జట్టు ఒపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒక పెద్ద ప్లాన్ వేసినట్టు అర్థం అవుతోంది.
Video Advertisement
అదేంటంటే, బెంగళూరు జట్టుతో ఆడబోయే మ్యాచ్ కి ప్యాట్ కమిన్స్ ఒక కొత్త స్ట్రాటజీ ఉపయోగించాలి అని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ జట్టు టీంలో బ్యాటర్లు వేగంగా ఆడుతున్నారు. ఓపెనర్లు అయిన, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కూడా ఫామ్ లో ఉన్నారు. హెన్రిచ్ క్లాసెన్ ఫాస్ట్ గా రన్స్ స్కోర్ చేయడంతో పాటు, నితీష్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. వీళ్ళందరిలో ఎయిడెన్ మార్క్రమ్ మాత్రమే సాధారణంగా గేమ్ ఆడుతున్నారు. ఎయిడెన్ మార్క్రమ్ స్ట్రైక్ రేట్ బాగుంది. కానీ హైదరాబాద్ జట్టులో ఉండే హిట్టర్స్ అతని కంటే చాలా బాగా ఆడుతున్నారు. అందుకే ఇతని స్థానంలో ఇంకొకళ్లని దింపాలి అని ప్యాట్ కమిన్స్ నిర్ణయించుకున్నారు.
అందుకోసం కివీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ ని అనుకుంటున్నారు. హైదరాబాద్ జట్టు యాజమాన్యం కూడా ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారం. ఎయిడెన్ మార్క్రమ్ చాలా నెమ్మదిగా ఆడుతున్నారు. అతని స్థానంలోకి ఫిలిప్స్ వస్తే జట్టుకు ఇంకొక మంచి హిట్టర్ దొరికినట్టే అని అనుకున్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మ్యాచ్ కి మంచి ప్రారంభాన్ని ఇస్తున్నారు. ఆ తర్వాత ఫిలిప్స్ బాగా ఆడితే, క్లాసెన్ తో పాటు మిగిలిన బ్యాటర్లు పని అంతా చూసుకుంటారు అని ప్యాట్ కమిన్స్ ఆలోచిస్తున్నారట. అంతే కాకుండా, ఫిలిప్స్ జట్టులోకి రావడం వల్ల ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ వచ్చే అవకాశం ఉంది. ఫీల్డింగ్‌లో ఫిలిప్స్ కి చాలా మంచి పేరు ఉంది. దాంతో ప్యాట్ కమిన్స్ చాలా పెద్ద ప్లాన్ వేశారు అని అందరూ కామెంట్ చేస్తున్నారు.
ALSO READ : మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు ఇలా మారిపోయిందేంటి..?
End of Article