సైనా నెహ్వాల్ బయోపిక్ కోసం పరిణితి చోప్రా కు ట్రైనింగ్ ఇచ్చిన రియల్ హీరో గురించి ఈ విషయాలు తెలిస్తే..హాట్స్ ఆఫ్ అంటారు..!

సైనా నెహ్వాల్ బయోపిక్ కోసం పరిణితి చోప్రా కు ట్రైనింగ్ ఇచ్చిన రియల్ హీరో గురించి ఈ విషయాలు తెలిస్తే..హాట్స్ ఆఫ్ అంటారు..!

by Anudeep

Ads

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో బయోపిక్ ల హవా నడుస్తోంది. ప్రముఖ బ్యాడ్మింటన్ కళాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ కూడా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో సైనా నెహ్వాల్ పాత్రలో పరిణితి చోప్రా నటిస్తున్నారు. ఈ సినిమా కు “సైనా” అనే టైటిల్ ను పెట్టారు. ఈ చిత్రం కోసం పరిణితి చోప్రా ఎంత గానో శ్రమిస్తున్నారు. ప్రత్యేకం గా ఈ సినిమా కోసం ఆమె పది కేజీలు బరువు తగ్గారు. అంతే కాదు.. బ్యాడ్మింటన్ పై పట్టు సాధించడం కోసం ఆమె ప్రత్యేకం గా శిక్షణ కూడా తీసుకున్నారు.

Video Advertisement

srikanth 1

ఈ సినిమా కోసం పరిణితి ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారో తెలుసా..? ఒకప్పుడు సైనా నెహ్వాల్ ను ట్రైన్ చేసిన థానే కోచ్ శ్రీకాంత్ వాడ్ వద్దనే.. పరిణితి చోప్రా కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. శ్రీకాంత్ వాడ్ కేవలం కోచ్ మాత్రమే కాదు.. ఓ రియల్ హీరో కూడా. ఆ విషయాన్నీ ఆయన రియల్ స్టోరీ తెలిస్తే మీరే ఒప్పుకుంటారు. అమోల్ గుప్త దర్శకత్వం లో తెరకెక్కుతున్న “సైనా” చిత్రం ట్రైలర్ రిలీజ్ అయినప్పటినుంచి తెరపై సైనా గా పరిణితి అంత పర్ఫెక్ట్ గా ఎలా కనిపిస్తున్నారని ఆశ్చర్యపోతున్నారు. దానికి కారణం తెర వెనుక ఆమెకు ట్రైనింగ్ ఇచ్చిన హీరో శ్రీకాంత్ వాడ్.

srikanth 2

మీడియా నుండి నెటిజన్ల వరకు అందరు పరిణితి పర్ఫెక్షన్ గురించే చర్చిస్తున్నారు. బాడీ లాంగ్వేజ్ అయినా, బాడ్మింటన్ కోర్టులో తీవ్రత, వేసుకున్న బట్టలు, ఆమె రాకెట్ పట్టుకున్న విధానం అన్ని సైనా లానే ఉన్నాయి. బయో పిక్ లు తీసేటప్పుడు కత్తి మీద సాము లాంటి అంశం ఏంటంటే ఒరిజినల్ వ్యక్తులను అనుకరించడం. చూసే ప్రేక్షకులు ఎగతాళి చేసే విధం గా నటన ఉండకూడదు. అందుకే ఈ విషయం లో ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. శ్రీకాంత్ ఆ విషయం లో మాత్రం వందశాతం కృషి చేసారు.

srikanth 3

థానేకు చెందిన శ్రీకాంత్ వాడ్, భారతదేశం నుండి వచ్చిన మొదటి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బిడబ్ల్యుఎఫ్) సర్టిఫికేట్ కోచ్. ఆయన “సైనా” సినిమా కోసం పరిణితి చోప్రా ను కూడా ట్రైన్ చేసారు. ఇటీవల ఈ ట్రైనింగ్ వీడియో రిలీజ్ అవ్వగా, అందులో శ్రీకాంత్ పరిణితి కి ఎంత శ్రద్ధ గా వివరిస్తున్నారో చూపారు. మరో మాటలో, అమోల్ గుప్తా శ్రీకాంత్ వాడ్ జీవిత గాధను కూడా తెరకెక్కించాలనుకుంటున్నట్లు కూడా పేర్కొన్నారు.

parinithii

“వాడ్ సర్ గత 32 సంవత్సరాలుగా తెర వెనుక దాక్కున్నారు … ఆయన అనేక సవాళ్ళను ఎదుర్కొని, ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులను తీసుకొని తన ఇంట్లో పెంచుతున్నారు. వారిలో ఎనిమిది మంది శివ ఛత్రపతి అవార్డు విజేతలు ఉన్నారు ”అని అమోల్ గుప్తా 2019 లో హిందూస్తాన్ టైమ్స్‌తో అన్నారు. తక్కువ వయస్సు గల ఆటగాళ్లకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం ద్వారా అసంఖ్యాక జీవితాలను మార్చిన రియల్ లైఫ్ హీరో వాడ్.

badminton shrikanth

ఒక ప్రసిద్ధ ఫార్మా స్యూటికల్ సంస్థ నుంచి మంచి వేతనం వచ్చి ఉద్యోగాన్ని వాడ్ వదులుకొన్నారు. కేవలం బాడ్మింటన్ లక్ష్యం గా ఆయన కోచ్ గా మారారు. తానూ మంచి ప్లేయర్ అవ్వాలన్నది వాడ్ కల. కానీ, కుటుంబ పరిస్థితులు అందుకు సహకరించలేదు. వాడ్ 32 ఏళ్ళ వయసులో ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయ్యారు. ఆయనకు సరైన మార్గం లో తీసుకెళ్లే గైడ్ దొరకలేదు. అందుకే వాడి బాడ్మింటన్ లోకి ఆలస్యం గా వచ్చారు. అందుకే.. వాడ్ తనలాంటి వారికి గైడ్ గా మారాలనుకున్నారు. స్థోమత లేని, టాలెంట్ ఉండి, ఆసక్తి ఉన్నవారికి తానూ ట్రైనింగ్ ఇస్తూ వారిని సక్సెస్ ఫుల్ ఆటగాళ్లు గా తీర్చిదిద్దుతున్నారు.

srikanth 4

అనుకున్నదే లక్ష్యం గా థానే బ్యాడ్మింటన్ అకాడమీ ను స్థాపించారు. అప్పటి నుంచి పలువురు ఆసక్తి కలిగిన యువతకు ఆయన శిక్షణ ఇస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు వాడ్ డెడికేటెడ్ గా పని చేసారు. థానే ను కూడా భారత్ లోని ఇతర ప్రాంతాలతో సమానం గా తీసుకురావడానికి ఆయన అంకితమయ్యారు. వేలాది మంది విద్యార్థులకు వాడ్ బ్యాడ్మింటన్ పాఠాలు చెప్పారు. వీరందరూ 500 రూపాయల కంటే తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల నుంచి వచ్చిన వారే. అతని విద్యార్థులలో 16 మంది జాతీయ ఛాంపియన్లు, 42 మంది అంతర్జాతీయ ఆటగాళ్ళు (నెహ్వాల్‌తో సహా) మరియు వందలాది మంది రాష్ట్ర స్థాయిలో ఆడిన వారు ఉన్నారు. ఎంతైనా గ్రేట్ కదా..


End of Article

You may also like