Ads
ప్రముఖ ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో సీజన్ 6 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుందనే సంగతి తెలిసిందే. దీంతో బిగ్ బాస్ అభిమానులకు పండుగ వాతావరణం వచ్చేసింది. గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ లో యంగ్ కంటెస్టెంట్లను ఎక్కువగా ఎంపిక చేశారు.
Video Advertisement
ఈ టీవీ లో వచ్చే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పాపులర్ అయిన కమెడియన్లను స్టార్ మా భారీ పారితోషికం ఇచ్చి బిగ్ బాస్ తీసుకోవడం మనం చూస్తున్నాం. అయిత్ సీజన్ 6 లో ఏకంగా యిద్దరు కమెడియన్లు బిగ్ బాస్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. వారే చలాకి చంటి. ఫైమా. వీరిద్దరే కాకుండా టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయ్యి తాజాగా జబర్దస్త్ లో కనిపిస్తున్న గీతూ రాయల్ కూడా బిగ్ బాస్ లో ప్రత్యక్షమైంది.
ఇప్పటికే పలువురు జబర్దస్త్ కమెడియన్లు వేర్వేరు కారణాల వల్ల ఆ షో కి దూరంగా ఉంటున్నారు. మరో వైపు స్టార్ మా ఇలా ముగ్గురు కమెడియన్లను బిగ్ బాస్ షో కి తీసుకొచ్చి జబర్దస్త్ కి గట్టి దెబ్బ కొట్టిందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
బిగ్ బాస్ నిర్వాహకులతో ఉన్న ఒప్పందం ప్రకారం కంటెస్టెంట్లు బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టార్ మా ఛానల్ లోని ప్రోగ్రామ్స్ కు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ కారణాల వల్ల రాబోయే రోజుల్లో కూడా చలాకీ చంటి, ఫైమా, గీతూ రాయల్ ను జబర్దస్త్ లో చూడటం సులువు కాదు.
మరోవైపు చలాకీ చంటి ఎప్పటి నుంచో జబర్దస్త్ లో ఉంటూ తనని తానూ నిరూపించుకున్నాడు. మరో వైపు ఫైమా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటుంది. గీతూ రాయల్ కొత్తగా జబర్దస్త్ లో కనిపిస్తోంది. బిగ్ బాస్ షో తర్వాత స్టార్ మా చలాకి చంటి, ఫైమా ల టాలెంట్ ను ఉపయోగించుకొని రేటింగ్ ను పెంచుకొనే ప్లాన్ లో ఉందని వారి అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే విధంగా స్టార్ మా అదిరిపోయే ప్లాన్ వేసిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రోజురోజుకు కమెడియన్ల సంఖ్య తగ్గుతుండటంతో జబర్దస్త్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సుధీర్, హైపర్ ఆది దూరంగా ఉండటంతో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ను ప్రజలు ఇంతకు ముందులా ఆదరించట్లేదు. దీంతో ఆ షో రేటింగ్స్ తగ్గాయనే సంగతి తెలిసిందే.
End of Article