“విరాట్ కోహ్లీ” కెరీర్‌లో… “రివెంజ్” తీర్చుకున్న 6 సందర్భాలు ఇవే..!

“విరాట్ కోహ్లీ” కెరీర్‌లో… “రివెంజ్” తీర్చుకున్న 6 సందర్భాలు ఇవే..!

by kavitha

Ads

రన్ మెషీన్ “విరాట్ కోహ్లీ” గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోహ్లీ ఆవేశం గురించి కూడా అందరికి తెలిసిందే. కోహ్లీకి ఆవేశం వస్తే ఆపడం ఎవరి తరం కాదు. ఈ దూకుడే భారత జట్టు కెప్టెన్‌గా టెస్టుల్లో ఎన్నో విజయాలను సాధించింది.

Video Advertisement

కానీ అదే స్వభావం వల్ల కెప్టెన్సీ కోల్పోయాడు. ఇక ఎవరైనా తన పై కౌంటర్ వేశారా దానికి అతని రీవెంజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. ఎదుటివారు తనకి కౌంటర్ ఇచ్చినా, వెక్కిరించినా, బెదిరించినా, గొడవ పెట్టుకున్నా తిరిగి అదే విధంగా కోహ్లీ ఎదుటవారికి సరైన రీతిలో సమాధానం చెప్తాడు. దీనికి ఉదాహరణ తాజాగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ అని చెప్పవచ్చు.

1. విరాట్ కోహ్లీ – గౌతమ్ గంభీర్

గత నెల బెంగళూరులో సొంతగడ్డ పై ఆర్‌సీబీని వికెట్ తేడాతో లక్నో జట్టు ఓడించింది. చివరి బంతికి లక్నో జట్టు గెలవగానే గౌతమ్ గంభీర్, ఆర్‌సీబీ జట్టు ఫ్యాన్స్ వైపు తిరిగి నోరు మూసుకోవాలన్నట్టుగా సైగ చేశాడు. ఈ విషయం కోహ్లీకి కోపం తెప్పించింది. ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో దీనికి రీవెంజ్ గా 2 క్యాచులు పట్టుకోగానే కోహ్లీ ఆవేశంగా సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. అదే గోడవకు కారణం అయ్యింది. ఇది మొదటిసారి కాదు. కోహ్లీ ఇలా తన కెరీర్ లో ఎన్నో సార్లు చాలా మంది ఆటగాళ్ల పై రివెంజ్ తీర్చుకున్నాడు. అందులో టాప్ 5 రివెంజ్ మూమెంట్స్ ఇప్పుడు చూద్దాం..
2. విరాట్ కోహ్లీ -మిచెల్ జాన్సన్‌ (2014):

2014 లో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత జట్టు మొదటి 2 టెస్ట్ మ్యాచుల్లో అపజయం పొందింది. ఇక 3 వ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 530 రన్స్ చేసింది. తరువాత బ్యాటింగ్ దిగిన భారత జట్టు 108 రన్స్ కే  2 వికెట్లు కోల్పోయారు. కోహ్లీ బ్యాటింగ్ కి రాగా, బౌలింగ్ చేస్తున్న జాన్సన్ బౌన్సర్ తో స్వాగతం చెప్పాడు. అలా ఇద్దరి మధ్య వార్ మొదలైంది.
ఆ తరువాత కోహ్లీ 84 పరుగుల దగ్గర ఉన్నపుడు జాన్సన్ వేసిన బంతిని డిఫెండ్ చేసాడు. అయితే వికెట్ పడట్లేదనే అసహనంతో జాన్సన్ బంతిని నేరుగా కోహ్లీ మీదకు విసిరాడు. అది కోహ్లీకి గట్టిగా తగలడంతో కాస్త ఇబ్బంది పడ్డాడు. ఆగ్రహించిన కోహ్లీ తరువాత బంతిని బౌండరీ కొట్టి జాన్సన్ కు గట్టిగా రిప్లై ఇచ్చాడు. అంతేకాకుండా జాన్సన్ బౌలింగ్ చేసినపుడల్లా బౌండరీలు కొట్టాడు. అలా సెంచరీ చేశాడు. 150 పరుగుల చేశాక ఫోర్ కొట్టి జాన్సన్ కి గాల్లోనే ముద్దులు పెట్టాడు.

3. విరాట్ కోహ్లీ – బెన్ స్టోక్స్‌ (2016 ):

2016 నవంబర్ 26న మొహాలీ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట  బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 283 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. తరువాత బ్యాటింగ్ దిగిన భారత ఆటగాళ్లు  73 పరుగులకే 2 వికెట్లు కోల్పోయారు. ఈ సమయంలో బ్యాటింగ్ కి వచ్చిన కోహ్లీ అర్ధ సెంచరీ చేశాడు. 62 పరుగులు వద్ద బెన్ స్టోక్స్ బౌలింగ్ లో కోహ్లీ  ఔట్ అయ్యాడు.
వికెట్ తీసిన సంతోషంలో స్టోక్స్ తన చేత్తో నోటిని మూసుకుని కోహ్లీని ఎగతాళి చేస్తూ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. అయితే కోహ్లీ న్యూటన్ థర్డ్ లాను అప్లై చేయడంలో దిట్ట. దాంతో అతను ఎక్కువ ఆలస్యం చేయలేదు. ఆ మ్యాచ్ 2వ ఇన్నింగ్స్ లో స్టోక్స్ 5 రన్స్ చేసి LBW అయ్యాడు. అయితే అంపైర్ దాన్ని అవుట్ గా నిర్ధారించలేదు. దాంతో కోహ్లీ రివ్యూ తీసుకుని బెన్ స్టోక్స్ కు సెండ్ ఆఫ్ ఇచ్చాడు. తన చేతిని నోటి పై పెట్టుకుని చూపిస్తూ బెన్ స్టోక్స్ కు దిమ్మతిరిగే విధంగా రిప్లై ఇచ్చాడు.

4. విరాట్ కోహ్లీ- గ్లెన్ మాక్స్‌వెల్ (2017 ) :

2017లో ఆస్ట్రేలియా తో జరిగిన 3వ టెస్ట్ మ్యాచ్ లో ముందుగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసింది. వారి బ్యాటింగ్ టైమ్ లో కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్నాడు. అయితే బౌండరీని ఆపే ప్రయత్నంలో కోహ్లీ కిందపడడంతో అతని షోల్డర్ కి గాయం అయ్యింది. తరువాత ఆస్ట్రేలియా జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆస్ట్రేలియన్ ప్లేయర్స్  విరాట్ గాయాన్ని వెక్కిరిస్తూ కోహ్లీని రెచ్చగొట్టారు. వారిలో గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్ ఇద్దరు విరాట్ గాయాన్ని వెక్కరిస్తూ షోల్డర్ పట్టుకున్నారు.
వారు అక్కడితో అయిపోయింది అనుకుని ఉంటారు. ఆ విషయన్నిగుర్తుపట్టుకున్న కోహ్లీ, సెకండ్ ఇన్నింగ్స్ లో వారికి మైండ్ బ్లోయింగ్ రిప్లై ఇచ్చాడు. జడేజా బౌలింగ్ లో ఆస్ట్రేలియా తొలి వికెట్ పడగానే కోహ్లీ ఆస్ట్రేలియా ఆటగాళ్లను ట్రోల్ చేసాడు. తన భుజాన్ని పట్టుకుని ఆవేశంతో ఊగిపోతూ సెలెబ్రేట్ చేసుకున్నాడు.

5. విరాట్ కోహ్లీ -కేస్రిక్ విలియమ్స్:

ఈ సంఘటన క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ రివెంజ్స్ లో ఒకటిగా నిలిచింది.  2017లో భారత జట్టు వెస్టిండీస్ టూర్ లో భాగంగా ఆడిన టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ బౌలర్ కెసిరిక్ విలియమ్స్ కోహ్లీని ఔట్ చేసాడు. వికెట్ తీసిన తరువాత  తనదైన స్టైల్లో నోట్ బుక్ ను ఊహించుకుని అందులో కోహ్లీ పేరు రాసి, టిక్ చేసి సెలెబ్రేట్ చేసున్నాడు. అప్పుడు సైలెంట్ గా ఉన్న కోహ్లీ, 2  ఏళ్ల తరువాత 2019 లో వెస్టిండీస్ జట్టు ఇండియా టూర్ కు వచ్చినపుడు రీవెంజ్ తీర్చుకున్నాడు.
హైదరాబాద్ లో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో కోహ్లీ బ్యాటింగ్ వచ్చి విలియమ్స్ బౌలింగ్ లో కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. ఆ తరువాత కోహ్లీ విలియమ్స్ చేసినట్టే ఇమాజినరీ నోట్ బుక్ లో రాసుకుని సెలబ్రేట్  చేసుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయిన విలియమ్స్ నెక్స్ట్ ఇండియాతో ఏ మ్యాచ్ జరిగిన వికెట్ తీసినపుడు సెలబ్రేషన్ చేసుకోలేదు.

6. విరాట్ కోహ్లీ – జో రూట్‌ (2018):

2018లో భారత జట్టు వన్డే సిరీస్ కోసం ఇంగ్లాండ్ కు వెళ్ళింది. దీనిలో భాగంగా జరిగిన 3 వన్డేల సిరీస్ లో భారత్ ఫస్ట్ వన్డే గెలవగా,  2 వ వన్డేలో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. సిరీస్ కైవసం చేసుకోవడానికి ఆడిన 3 వ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లో తన బ్యాటింగ్ తో జట్టును గెలిపించిన జో రూట్‌, సిరీస్ గెలిచిన సంతోషంలో తన చేతిలోని బ్యాట్ ను గ్రౌండ్ లో పడేసి సెలెబ్రేట్ చేసుకున్నాడు.
ఆ వన్డే సిరీస్ తరువాత జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ రూట్ కు తన స్టైల్లో సమాధానం చెప్పాడు. ఆ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో రూట్ 80 పరుగులు చేశాడు. అయితే సెంచరీకి సమీపంగా ఉన్న సమయంలో రూట్ కోహ్లీ వేసిన బంతికి రనౌట్ అయ్యాడు. కోహ్లీ రూట్ కు తన స్టైల్లో సెండ్ ఆఫ్ ఇచ్చి ప్రతీకారం తీర్చుకున్నాడు. మొదట సైలెన్స్ ప్లీజ్ అన్నట్టు సైగ చేసిన కోహ్లీ, తరువాత బ్యాట్ ఊహించుకుని ఆ బ్యాట్ ను పడేస్తున్నట్టుగా చూపించి రూట్ కు సమాధానం ఇచ్చాడు.

Also Read: “ఇదంతా ఎప్పుడో చూసినట్టుందే..!” అంటూ… RCB VS LSG మ్యాచ్‌లో “కోహ్లీ-గంభీర్” గొడవపై 10 మీమ్స్..!


End of Article

You may also like