గత ఏడాది టీ20ల్లో రికార్డుల మోత మోగించేసిన ఈ టీ20 స్పెషలిస్ట్ సూర్య కుమార్ యాదవ్ తొలి టెస్ట్ లోనే ఫెయిల్ అయ్యాడు. ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో శుక్రవారం రెండో సెషన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 20 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులే చేసి ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే రెండో బంతికి స్వీప్ షాట్ ఆడి బౌండరీ సాధించిన సూర్యకుమార్ యాదవ్.. అదే ఊపులో ఆడబోయి స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.

Video Advertisement

వాస్తవానికి సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శుభమన్ గిల్ ఈ నాగ్‌పూర్ టెస్టులో ఆడాల్సి ఉంది. కానీ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ని ఓపెనర్‌గా ఆడించాలని నిర్ణయించిన టీమిండియా మేనేజ్‌మెంట్ శుభమన్ గిల్‌ని పక్కనపెట్టింది. ఒకవేళ గిల్ ఈ మ్యాచ్‌లో ఆడింటే? అప్పుడు మిడిలార్డర్‌లో కేఎల్ రాహుల్ ఆడేవాడు. దాంతో సూర్యకుమార్ యాదవ్ రిజర్వ్ బెంచ్‌పై కూర్చోవాల్సి వచ్చేది. కానీ ఇప్పటికి సూర్య కుమార్ యాదవ్ కి ఛాన్స్ దక్కింది.

surya kumar yadav new record..

గత ఏడాదికాలంగా టీ20ల్లో రికార్డుల మోత మోగించేస్తున్న సూర్య.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ బ్యాటర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తాజాగా టెస్టుల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. సుదీర్ఘ ఫార్మాట్ లోకి ఎంట్రీ ఇవ్వాలన్న సూర్య కుమార్ యాదవ్ కల ఇప్పటికి నెరవేరింది. సూర్యకుమార్ యాదవ్ వయసు ఇప్పుడు 32 ఏళ్లు. అరంగేట్రం టెస్టులో సూర్యకుమార్ యాదవ్ విఫలమైనప్పటికీ ఓ అరుదైన రికార్డ్‌ని నమోదు చేశాడు.

surya kumar yadav new record..

30 ఏళ్ల వయసులో క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలోకి ఎంట్రీ ఇచ్చిన తొలి భారత క్రికెటర్‌గా ఘనత సాధించాడు సూర్యకుమార్ యాదవ్. 2021, మార్చిలో టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్.. 2021, జులైలో వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. తాజాగా టెస్టుల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. 30 ఏళ్ళ 181 రోజుల వయసులో సూర్యకుమార్ టీ 20 ల్లో అరంగ్రేటం చెయ్యగా.. 30 ఏళ్ళ 307 రోజుల వయసులో వన్డేల్లో, ఇప్పుడు 32 ఏళ్ళ 148 రోజులకు టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు.

surya kumar yadav new record..

టీ20ల్లో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా పేరొందిన సూర్య ఇటీవల వన్డేల్లోనూ వరుసగా విఫలమైన విషయం తెలిసిందే. టీ20ల్లో సూర్య రాక ముందు మన మిడిలార్డర్ చాలా అనిశ్చితి గా ఉండేది. ఎవరు ఎప్పుడు ఆడతారో తెలియని పరిస్థితి. కానీ సూర్య వచ్చిన దగ్గర్నుంచి టీం డగౌట్, స్టేడియంలో కూర్చున్న ఫ్యాన్స్, టీవీల ముందు చూస్తున్నవారు…. ఇలా అందరికీ నేనున్నాను అంటూ ఓ ధీమా కల్పించాడు. సూర్య వచ్చిన దగ్గర నుంచి టీ20ల్లో 7 నుంచి 15 ఓవర్ల మధ్య రన్ స్కోరింగ్ చాలా బాగా పెరిగింది.ఏడాదిన్నరలోనే ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం సాధించాడు. విరాట్ కోహ్లీ తర్వాత ఈ ఘనత సాధించిన భారత బ్యాటర్… సూర్యకుమారే.