టబాస్సం ఫాతిమా హస్మి, ఈ పేరేంటి వింతగా ఉంది అనుకుంటున్నారా. ఈ పేరు ఎవరిదో కాదు మన టబు అసలు పేరు. టబు గుర్తుండే ఉంటుంది 90’s లో కుర్రకారు గుండెల్లో గుడి కట్టుకున్న హీరోయిన్. అందరికీ డ్రీమ్ గర్ల్. తెలుగులో చాలా హిట్ సినిమాల్లో నటించింది టబు. ఇప్పటికీ కూడా తెలుగులో మదర్ క్యారెక్టర్ లు చేస్తూ అలరిస్తూ ఉంది. అయితే 52 సంవత్సరాల టబు ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా…?
టబు సినీ ప్రస్థానం గురించి తీసుకుంటే 1982లో బజార్ సినిమాతో చైల్డ్ ఆక్టర్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సీనియర్ హీరోయిన్ గా బాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేసింది. తనని తాను యాక్టర్ గా నిరూపించుకోవడానికి ఎన్నో రకాల పాత్రలు చేసి మెప్పించింది.
అయితే తెలుగులో కూడా టబు నాగార్జున సరసన పలు చిత్రాల్లో నటించింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నిన్నే పెళ్ళాడతా సినిమా అయితే ఆల్ టైం ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ హిట్. తర్వాత హలో బ్రదర్ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. విక్టరీ వెంకటేష్ సరసన కూలి నెంబర్ వన్ సినిమాలో కూడా నటించింది. అయితే తాజాగా అల్లు అర్జున్ అల వైకుంఠపురం సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది.తనకి 52 సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలు టబు పలు సందర్భాల్లో తెలిపింది.
తనకి సింగిల్ గా ఉండడం అంటే ఇష్టమని తెలిపింది. జీవితంలో ఆనందం అనేది చాలా విధాలుగా మనకు దక్కుతుందని, మన ఆనందానికి మనమే కారణం అవ్వాలని, ఒక రాంగ్ పార్ట్నర్ ను ఎంచుకుని లైఫ్ నాశనం చేసుకోవడం ఇష్టం లేదని అంటుంది. ఆడ మగ రిలేషన్ షిప్ అనేది కాంప్లికేటెడ్ అని, యుక్త వయసులో ప్రేమ గురించి అవగాహన ఉంటుంది కానీ వయసు పెరిగే కొద్దీ రకరకాల ఎక్స్పీరియన్స్ వస్తాయని తెలియజేసింది. తన ఆలోచన విధానం వేరుగా ఉందని తెలిసినా కూడా తనకి అలానే ఉండటం ఇష్టం అని తెలియజేసింది. ఒక విధంగా తన సింగిల్ గా ఉండిపోవడానికి గల కారణం బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ అంటూ కూడా చెప్పుకొచ్చింది.
అయితే టబు తన కెరీర్ స్టార్టింగ్ లో పలు హీరోలతో ఎఫైర్స్ నడిపించింది. వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది బాలీవుడ్ హీరో సంజయ్ కపూర్. తర్వాత సాజిద్ నడియవాల తో కొద్దిరోజులు కలిసి తిరిగింది. అలాగే టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునతో టబుకి ఎఫైర్ ఉందనే విషయం కూడా సినీ జనాలు చెప్పుకుంటారు. కాకపోతే వాటిపై ఎవరు స్పందించలేదు.
Also Read:జబర్దస్త్ కి కొత్త యాంకర్…ఎవరో తెలుసా…!