“గీతూ” ఇంకా బాధ పడుతూనే ఉంది..! స్పందించిన ‘గీతూ రాయల్’ టీం..!

“గీతూ” ఇంకా బాధ పడుతూనే ఉంది..! స్పందించిన ‘గీతూ రాయల్’ టీం..!

by Anudeep

Ads

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగినవారు అనూహ్యంగా ఎలిమినేట్ అవుతున్నారు. ఇదివరకే టాప్ 5లో ఉంటాడనుకున్న ఆర్జే సూర్య ఎనిమిదో వారం ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లాడు. తాజాగా గీతూ రాయల్ అనుకోని విధంగా ఎలిమినేట్ అయింది.

Video Advertisement

 

ఇక బిగ్‌బాస్ వేదికపైన నాగార్జునతో కలిసి తన జర్నీని చూస్తూ ఎమోషనల్ అయింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండనివ్వండి.. నేను బయటకు వెళ్లను అంటూ భోరుమని విలపించింది. గీతూను ఓదార్చేందుకు నాగార్జున ప్రయత్నించాడు. చివరకు బిగ్‌బాస్ సిబ్బందిని పిలిపించి.. బయటకు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

team geethuroyal's post after her elimination...

బిగ్ బాస్ కేఫ్ లో కూడా “నేనే విన్నర్ ని అనుకున్నా.. ఎలిమినేట్ అవుతానని అస్సలు ఊహించలేదు” అంటూ ఎమోషనల్ అయిపోయిఇంది గీతూ. మరో వైపు గీతూ రాయల్ ఎలిమినేషన్ ఎపిసోడ్ కి భారీగా టీఆర్పీ రేటింగ్స్ వచ్చినట్టు సమాచారం.

team geethuroyal's post after her elimination...
అయితే తాజాగా గీతూ రాయల్ టీం ఆమె ఎలిమినేషన్ పై ఒక పోస్ట్ పెట్టగా అది వైరల్ గా మారింది. ” గీతూ ఇంకా బాధ లోనే ఉంది. ఆమె ఇలా ఎలిమినేట్ అవుతానని అస్సలు ఊహించలేదు. తాను తిరిగి మాములు కావడానికి కాస్త టైం పడుతుంది. ఆమె త్వరలోనే బౌన్స్ బ్యాక్ అవుతుంది. తనని అర్థం చేసుకోవడం చాల కష్టం. కానీ ఒకసారి ఆమె గురించి తెలిస్తే ఎవరు వదులుకోరు. ఆమెకు తన భావాలను వ్యక్త పరచటం సరిగ్గా తెలీదు. మొదటినుంచి తొమ్మొది వారల వరకు ఆమెను సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు” అంటూ ఆ పోస్ట్ లో పెట్టారు గీతూ టీం.

team geethuroyal's post after her elimination...
ఎలిమినేట్ అయితే తాను అండమాన్ వెళ్లిపోతానని గీతూ గతం లో ఒకసారి చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె అక్కడికే వెళ్లబోతుందని సమాచారం.


End of Article

You may also like