ఈ 16 “తెలుగు సీరియల్” హీరోల రెమ్యూనరేషన్స్ ఎంతో తెలుసా..? అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరో ఎవరంటే..?

ఈ 16 “తెలుగు సీరియల్” హీరోల రెమ్యూనరేషన్స్ ఎంతో తెలుసా..? అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరో ఎవరంటే..?

by kavitha

Ads

ఒకప్పుడు టీవి నటులకు పాపులారిటీ, క్రేజ్, రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉండేది. ప్రస్తుతం సినిమాతో పాటు, బుల్లితెర ఇండస్ట్రీ వ్యాప్తి పెరిగింది. నిర్మాణ విలువలు పూర్తిగా మారిపోయాయి. సోషల్ మీడియాతో సీరియల్స్ కి  పాపులారిటీ, ఫ్యాన్ బేస్ పెరిగింది.

Video Advertisement

బుల్లి తెర హీరోలు ఎక్కడికి వెళ్లినా జనాలు గుర్తిస్తున్నారు. టీవీ ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో? వారిలో అంతరికన్నా ఎక్కువ రెమ్యూనరేషన్  తీసుకుంటున్న బుల్లితెర హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.. 1. నిరుపమ్ పరిటాల :

కార్తీకదీపం సీరియల్‌ లో హీరో డాక్టర్ బాబుగా నటించిన నిరుపమ్ పరిటాల ఈ సీరియల్ కి రోజుకి రూ.40 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటునట్లు సమాచారం. ప్రస్తుతం నిరుపమ్ పరిటాల రోజుకి రూ.30-40 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటు అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా ఉన్నారు.
2. శ్రీరామ్ :
ప్రేమ ఎంత మధురం సీరియల్‌లో హీరో ఆర్యవర్ధన్‌గా నటిస్తున్న శ్రీరామ్ అత్యధిక పారితోషికం తీసుకునే బుల్లితెర హీరోల్లో ఒకరు.శ్రీరామ్ రోజుకి రూ.40 వేలు పారితోషికం అందుకుంటారని తెలుస్తోంది. శ్రీరామ్ నటుడిగానే కాకుండా నిర్మాతగా పలు సీరియల్స్‌కి ప్రొడ్యూస్ చేశారట.
3. ప్రభాకర్:

ఈటీవీ ప్రభాకర్ ఒకప్పుడు టెలివిజన్ ఇండస్ట్రీని ఏలిన నటుడు. అతన్ని బుల్లితెర మెగాస్టార్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఆయన అడపా దడపా నటిస్తున్నప్పటికీ పారితోషికం విషయంలో మాత్రం ప్రస్తుత బుల్లితెర హీరోలతో సమనంగా తీసుకుంటున్నారు. ప్రభాకర్ రోజుకి రూ.35-40 వేలు పారితోషికం అందుకుంటున్నారట.
4. ఇంద్రనీల్ వర్మ:
చక్రవాకం, మొగులిరేకులు లాంటి సూపర్ హిట్ సీరియల్స్‌తో అలరించిన ఇంద్ర నీల్. సీరియల్స్ హీరోలకు కూడా ఫ్యాన్ బేస్‌ని తీసుకొచ్చిన నటుడిగా పేరు పొందారు. రీసెంట్‌గా గృహలక్ష్మి సీరియల్‌లో సామ్రాట్‌గా నటించారు. ఆ సీరియల్ కి రోజుకి రూ 30 వేల పైన పారితోషికం తీసుకుంటునట్లు సమాచారం.
5. మానస్:

కార్తీకదీపం సీరియల్ ముగిసిన తరువాత అదే సమయంలో బ్రహ్మముడి అనే సీరియల్ మొదలైంది. ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో ఇదే టాప్ టీఆర్పీ రేటింగ్‌లో దూసుకెళ్తోంది. ఇక ఈ సీరియల్‌లో హీరోగా నటిస్తున్న మానస్‌ రెమ్యూనరేషన్ రోజుకు రూ.25 వేలు పారితోషికం తీసుకుంటునట్లు సమాచారం.
6. వీజే సన్నీ:
కళ్యాణ వైభోగమే సీరియల్‌ హీరోగా నటించి, పాపులర్ అయిన వీజే సన్నీ, ఆ తరువాత బిగ్ బాస్ 5లో విన్నర్ కావడంతో రెమ్యూనరేషన్ రేంజ్ మారిపోయింది. కళ్యాణ వైభోగం సీరియల్ కి రోజుకి రూ.10-15 వేలు పారితోషికం తీసుకున్న సన్నీ, ప్రస్తుతం సినిమాల పైన దృష్టి పెట్టాడు. ఒక వేళ సన్నీ సీరియల్స్ లో నటిస్తే రోజుకి రూ.30-40 వేలు తీసుకోవచ్చని తెలుస్తోంది.
7. ముఖేష్ గౌడ:
గుప్పెడంత మనసు సీరియల్‌లో హీరోగా నటిస్తున్న కన్నడ యాక్టర్ ముఖేష్ గౌడ పారితోషికం మొదట్లో రూ.15 వేల కన్నా తక్కువగా ఉండేదంట. ఈ సీరియల్ సూపర్ హిట్ అవడంతో అతని పారితోషికం పెరిగింది. ప్రస్తుతం అతను రోజుకి రూ.20-22 వరకూ పారితోషికం తీసుకుంటునట్లు సమాచారం.
8. సాయి కిరణ్:
ఒకప్పటి తెలుగు స్టార్ హీరో సాయి కిరణ్ బుల్లితెర పై అనేక సీరియల్స్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్‌లో నటిస్తున్నారు. ఆయన రోజుకి రూ.30-35 వేలు పారితోషికం తీసుకుంటారని తెలుస్తోంది.
9. అమర్ దీప్ చౌదరి:
జానకి కలగనలేదు సీరియల్‌లో హీరోగా నటిస్తున్న అమమర్ దీప్ చౌదరి రోజుకి రూ.20 వేలు రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది.10. నంబూద్రి:

నాగ పంచమి సీరియల్ లో స్వామీజీగా నటిస్తున్న నంబూద్రి కన్నడ ఇండస్ట్రీలో సీనియర్ హీరో. నంబూద్రి రోజుకి రూ.25 వేలు పారితోషికం అందుకుంటున్నారట.
11. నిరంజన్:

ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్‌లో హీరోగా నటిస్తున్న కన్నడ బుల్లితెర హీరో నిరంజన్ రోజుకి రూ.20 వేలు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం.
12. గగన్ చిన్నప్ప:

కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో హీరో నటిస్తున్న కన్నడ పాపులర్ బుల్లితెర నటుడు గగన్ చిన్నప్ప రోజుకి రూ.20 వేలు పారితోషికం అందుకుంటున్నారట.
13. అర్జున్ అంబటి:

దేవత సీరియల్‌లో హీరోగా నటించిన అర్జున్ అంబటి రూ.15-20 వేలు పారితోషికం చార్జ్ చేస్తారట.14. రవి కృష్ణ:

మొగలిరేకులు, వరూధిని పరిణయం, ఆమె కథ వంటి సీరియల్స్ తో ఆకట్టుకున్న రవి కృష్ణ రోజుకి 15-20 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం.
15. మధుసూదన్:

ముత్యాల ముగ్గు, నా పేరు మీనాక్షీ, కథలో రాజకుమారి, కళ్యాణం కమనీయం సీరియల్స్ హీరో మధుసూదన్ రోజుకు 15-20 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది.
16. చందు గౌడ:

కన్నడ పాపులర్ యాక్టర్ చందు గౌడ 2020లో త్రినయని అనే సీరియల్ తో తెలుగు టీవి ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. పలు కన్నడ సినిమాలలో కూడా నటించాడు. ఈ సీరియల్ లో హీరో విశాల్ గా ఆకట్టుకున్నాడు. రోజుకి 15 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం.

Also Read: వెంకీ సినిమాలో “ట్రైన్” ఎపిసోడ్ చాలా సార్లు చూసి ఉంటారు..! కానీ ఈ విషయం గమనించారా..?


End of Article

You may also like