స్నేహానికి ప్రతిరూపం గా దుర్యోధన, కర్ణులని చూపిస్తారు.. ఎందుకో తెలుసా..? అసలు కథ ఇదే..!

స్నేహానికి ప్రతిరూపం గా దుర్యోధన, కర్ణులని చూపిస్తారు.. ఎందుకో తెలుసా..? అసలు కథ ఇదే..!

by Anudeep

Ads

స్నేహం అన్న పదం గుర్తుకు రాగానే పురాణాల్లో కుచేల, శ్రీ కృష్ణుల కథ గుర్తుకొస్తుంది. కానీ.. అదే కాకుండా.. మరొక వృత్తాంతం కూడా ఉంది. ఇది ఎక్కువ గా ప్రచారం లోకి రాకపోవడం తో చాలా మందికి తెలియదు. మహాభారతం లో.. దుర్యోధనుడు, కర్ణుడిది కూడా నిజమైన స్నేహం. వీరి స్నేహం ఎంత పటిష్టమైనదో.. ఇప్పుడు మీరు చదవబోయే సంఘటనలే చెబుతాయి.

Video Advertisement

duryodhana and karna 2

కర్ణుడికి దుర్యోధనుడిపైనా.. దుర్యోధనుడికి కర్ణుడి పైనా అపారమైన అభిమానం, నమ్మకం ఉన్నాయి. ఓ సారి.. దుర్యోధనుడి భార్య పాచికలు ఆడుతుండగా.. ఓ రాంగ్ స్టెప్ ను వేయబోతుంది. ఆ సమయం లో అనూహ్యం గా కర్ణుడు ఆమె చేతిని పట్టుకుని అడ్డుకుంటాడు. ఈ సమయం లో ఆమె చేతి ఆభరణం నుంచి ముత్యాలు రాలిపోతాయి. ఆ నిమిషం కర్ణుడు బాధపడుతుంటాడు. తాను అనుకోకుండా తన స్నేహితుడి భార్యని తాకాను అని ఫీల్ అవుతూ ఉంటాడు.

duryodhana and karna

అయితే మరో వైపు దుర్యోధనుడు ఆ ముత్యాలన్నిటిని ఏరి కర్ణుడి చేతిలో పెట్టి కౌగలించుకుంటాడు. కర్ణుడి పై ఉన్న నమ్మకాన్ని దుర్యోధనుడు ఈ విధం గా కనబరిచాడు. మరో సందర్భం లో కుంతి దేవి కర్ణుడి వద్దకు వెళ్లి.. అతని జన్మ వృత్తాంతాన్ని వివరిస్తుంది. కర్ణుడు పాండవులకు సొంత సోదరుడే అని.. పాండవులలో కలిసిపోతే పట్టాభిషేకం చేయిస్తానని కూడా చెబుతుంది.

duryodhana and karna 3

కుంతి దేవి మాటలు విన్న తరువాత కర్ణుడు పాండవులలో కలవడానికి నిరాకరిస్తాడు. తానూ దుర్యోధనునితోనే ఉంటానని చెబుతాడు. ఆ తరువాత శ్రీ కృష్ణుడు కర్ణుడి వద్దకు వచ్చినపుడు.. శ్రీ కృష్ణుడు కూడా పాండవులలో ఎందుకు కలవలేదు అని ప్రశ్నిస్తాడు. అయితే.. తానూ నిజమైన స్నేహితుడి గా ఉండాలి అని అనుకుంటున్నట్లు కర్ణుడు స్పష్టం చేస్తాడు.

duryodhana and karna 4

తనను నమ్మి దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధం అయ్యాడని చెబుతాడు. తనకు తన జన్మ వృత్తాంతం తెలుసనీ.. యుద్ధం లో పాండవులు ధర్మ బద్ధం గా గెలుస్తారని.. ధర్మ సంరక్షణ కోసమే శ్రీకృష్ణుడు పాండవులతో ఉన్నాడని తెలిసినా కూడా.. తానూ దుర్యోధనుడిని విడిచి రానని చెబుతాడు. అలా చేస్తే.. అది మిత్ర ద్రోహం అవుతుందని.. తాను నిజమైన స్నేహితుడిగానే మిగిలిపోవాలని కోరుకుంటున్నట్లు చెబుతాడు. అందుకే వీరిద్దరి స్నేహ బంధానికి అంత ప్రాముఖ్యత ఉంది.

 


End of Article

You may also like