Ads
ఐపీఎల్ అనేది చాలా మందికి ఒక మంచి అవకాశం. ఇక్కడ గనక తమ ప్రతిభని చూపిస్తే నేరుగా టీం ఇండియా జట్టులో చేరే అవకాశం ఉంటుంది. అందుకే ఆటగాళ్లందరూ తమ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు.
Video Advertisement
ఈ ఐపీఎల్‌లో యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సుయాష్ శర్మ, రింకూ సింగ్ లాంటి యువ ప్లేయర్స్.. తమ అద్భుతమైన ఆటతీరుతో టీమిండియా తలుపు తడుతుంటే.. మరికొందరు ఆటగాళ్లు పేలవమైన ఫామ్‌తో వచ్చిన ఛాన్స్‌లు మిస్ చేసుకుంటున్నారు.
ఈ సీజన్ లో ఫెయిల్ అవ్వడం వల్ల కొందరు ఆటగాళ్లకు టీమిండియా తలుపులు మూసుకుపోయినట్టే అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు వాళ్లెవరో చూద్దాం..
#1 సర్ఫరాజ్ ఖాన్
దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన సర్ఫరాజ్ ఖాన్.. ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. 4 మ్యాచ్‌ల్లో 13.25 సగటుతో 53 పరుగులు మాత్రమే చేశాడు. దీన్ని బట్టి సర్ఫరాజ్ ఖాన్ కి టీమిండియాలోకి చోటు దక్కడం కష్టమే అనిపిస్తోంది.
#2 దీపక్ హుడా
భారత్ తరఫున 10 వన్డేలు, 21 టీ20లు ఆడిన దీపక్ హుడా.. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో దీపక్ హుడా 12 మ్యాచ్‌ల్లో 7.64 సగటుతో 84 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఇతడి భవిష్యత్తు ప్రశ్నార్థకం గా మారింది.
#3 పృథ్వీ షా
ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతోన్న పృథ్వీ షా ఘోరంగా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఆడిన ఎనిమిది మ్యాచుల్లో 13.25 సగటుతో 106 పరుగులు చేశాడు. దీంతో టీమిండియాలో చోటు దక్కించుకోవడం కష్టమే అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
#4 రాహుల్ త్రిపాఠి
భారత్ తరఫున 5 టీ20ల్లో 97 పరుగులు చేసిన త్రిపాఠి.. ఈ సీజన్‌లో ఒకట్రెండు మినహా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడలేదు. 13 మ్యాచ్‌ల్లో 22.75 సగటుతో 273 పరుగులు చేశాడు.
#5 దీపక్ చాహర్
దీపక్ చాహర్ ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 9 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు పడగొట్టాడు. గాయాలు కారణంగా చాలావరకు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. దీంతో అతడి ఫిట్‌నెస్ ప్రశ్నార్థకంగా మారింది.
End of Article