ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ‘చెన్నై సూపర్ కింగ్స్’ అత్యంత నిలకడైన జట్టుగా పేరుగాంచింది. ఈ జట్టు ఐపీఎల్ లో పదమూడు సీజన్లు ఆడగా పదకొండు సార్లు ప్లే ఆఫ్స్ కు వెళ్ళింది. ఇక దీనిలో 4 సార్లు విజేతగా నిలిచింది. 2 సార్లు మాత్రమే ఐపీఎల్ స్టేజ్ నుండి వెనుదిరిగింది.

Video Advertisement

ఇక చెన్నై జట్టును బ్యాన్ చేయడం వల్ల 2016, 2017 ఐపీఎల్ సీజన్లలో పాల్గొనలేదు. అయితే ఐపీఎల్ లో చెన్నై జట్టుకు అన్నిట్లోనూ వ్యతిరేకంగా ఇంకో జట్టు ఉంది. ఆ జట్టు ఐపీఎల్ లో 15 సార్లు ఆడగా, 2 సార్లు మాత్రమే ప్లే ఆఫ్స్ కు వెళ్ళింది.

ఆ జట్టు పేరు పంజాబ్ కింగ్స్. ఇక ఈ జట్టు 2008లో జరిగిన ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అనే పేరుతో ఆడింది. అయితే ఈ జట్టు ఇప్పటి దాకా ఐపీఎల్ లో పెద్దగా ఏం సాధించలేకపోయింది. ఈ జట్టు గురించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే కెప్టెన్స్. ఇంతవరకు ఏ జట్టు కూడా మార్చని విధంగా ఈ జట్టు కెప్టెన్లను మారుస్తూ, సీజన్ కు ఒక న్యూ కెప్టెన్ తో ఐపిఎల్ లో ఆడుతోంది.ipl-punjab-kings1అలా పంజాబ్ కింగ్స్ ఇప్పటి దాకా పదమూడుమంది కెప్టెన్లను మార్చింది. ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న శిఖర్ ధావన్ పంజాబ్ జట్టుకి  14వ కెప్టెన్. ఈ జట్టుకి ఇంతకు ముందు యువరాజ్ సింగ్, జయవర్ధనే, కుమార సంగక్కార, జార్జ్ బెయిలీ, గిల్ క్రిస్ట్, డేవిడ్ హస్సీ, సెహ్వాగ్, మురళి విజయ్, మ్యాక్స్ వెల్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, అశ్విన్, మయాంక్ అగర్వాల్ కెప్టెన్లుగా చేశారు. ఐపీఎల్ 16వ సీజన్ లో శిఖర్ ధావన్ కెప్టెన్. అయితే పదమూడు మంది కెప్టెన్లను మర్చినప్పటికి కూడా పంజాబ్ కింగ్స్ జట్టుకి ఏమాత్రం కలిసి రాలేదు. ipl-punjab-kings3అయితే యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో మొదటి సీజన్ లోపంజాబ్ జట్టు సెమీస్ కి చేరింది. ఆ తరువాత 2014లో జార్జ్ బెయిలీ సారధ్యంలో ఫైనల్ కు వెళ్ళింది. ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ జట్టు ఉత్తమంగా ఆడింది ఈ రెండు సందర్భాలలో మాత్రమే. మిగిలిన ఐపీఎల్ సీజన్లలో లీగ్ టేబుల్లో ఆఖరి స్థానం కోసం పోటీ పడింది. ఇక ఈ టీంకు శిఖర్ ధావన్ 14వ కెప్టెన్ గా వచ్చాడు. 2023 సీజన్ లో ధావన్ పంజాబ్ ను ఎక్కడి వరకు తీసుకెళ్తాడో చూడాలి.Also Read: ఈ 15 మంది క్రికెటర్ల EDUCATIONAL QUALIFICATION ఏంటో తెలుసా..? ఏ క్రికెటర్ ఎంతవరకు చదువుకున్నారు అంటే..?