బిగ్ బాస్ తెలుగు- 6 లో ఈ ప్రముఖ యాంకర్..?

బిగ్ బాస్ తెలుగు- 6 లో ఈ ప్రముఖ యాంకర్..?

by Anudeep

Ads

టీవీ షోల్లో తిరుగులేని షోగా వెలుగొందుతుంది బిగ్ బాస్. ఇలాంటి షోలు మొదట విదేశాల్లో ఉండేవి అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో ఇండియాలో ప్రారంభించారు. మొదట నార్త్ లో ఈ షోని ప్రారంభించారు. అక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించడంతో అన్నీ దక్షిణాది రాష్ట్రాల్లో బిగ్ బాస్ ని ప్రారంభించారు.

Video Advertisement

ఇప్పటి వరకు బిగ్ బాస్ 5 సీజన్లో పూర్తి చేసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6పై దృష్టి పెట్టారు నిర్వాహకులు. ఈ సీజ‌న్‌కు కూడా నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఇక ఇటీవ‌ల ముగిసిన బిగ్ బాస్ నాన్‌స్టాప్‌లో వ‌చ్చిన టాప్ 5 కంటెస్టెంట్ల‌ను బిగ్ బాస్ 6కు నేరుగా తీసుకుంటార‌ని తెలుస్తోంది.

bigboss 1

అలాగే మిగిలిన కంటెస్టెంట్ల కోసం ప్ర‌స్తుతం ఎంపిక జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ సీజ‌న్‌ను ప్రారంభించ‌నున్నారు. అయితే ఈ సారి సీజ‌న్‌లో ప్రముఖ సీనియ‌ర్ యాంక‌ర్ ఉద‌య భానును తీసుకోవాల‌ని నిర్వాహ‌కులు అనుకుంటున్నారట.. యాంక‌ర్ ఉద‌య‌భాను ప్ర‌స్తుతం ఎలాంటి షోస్‌, సినిమాలు చేయ‌డం లేదు. కానీ ఆమెకు పాపులారిటీ బాగానే ఉంది. ఆమె మాట‌లు, యాంక‌రింగ్ ఎంతో మందిని ఆక‌ట్టుకుంటాయి.

ఆమె షోలో ఉంటే జోష్ వ‌స్తుంది. అందుకే ఆమెకు ఎంత రెమ్యున‌రేష‌న్ అయినా స‌రే ఇచ్చి బిగ్ బాస్ లోకి ర‌ప్పించాల‌ని చూస్తున్నారు. అయితే ఆమె అందుకు ఓకే చెప్పిందా.. లేదా.. అన్న వివ‌రాలు మాత్రం తెలియ‌లేరాలేదు. ఇక ఉద‌యభాను యాంక‌ర్‌గానే కాక సినిమాల్లోనూ కూడా న‌టించి అల‌రించింది. ఈమె రానా హీరోగా వ‌చ్చిన లీడ‌ర్ సినిమాలో రాజ‌శేఖ‌రా.. అంటూ ప్ర‌త్యేక పాట‌లోనూ నర్తించి ఆక‌ట్టుకుంది.

ఇటీవల పుష్ప సక్సెస్ ప్రోగ్రాం కర్నూల్ లో యాంకర్ గా చేసి బన్నీ ఫాన్స్ ని అలరించింది. అయితే ఉదయభాను బిగ్ బాస్‌లో పాల్గొంటే క‌చ్చితంగా రేటింగ్స్ వ‌స్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. క‌నుక‌నే ఈమె కోసం నిర్వాహ‌కులు అంతగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక ఈ షో ఆగస్టు చివ‌రి వారం లేదా సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో ప్రారంభం అవుతుంద‌ని తెలుస్తోంది.


End of Article

You may also like