Ads
టీం ఇండియా వరుస విజయాలతో ముందుకు వెళ్తోంది. అంతకుముందు ఆస్ట్రేలియాని 6 వికెట్ల తేడాతో ఓడించింది. రెండవ మ్యాచ్ అయిన ఆఫ్గానిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Video Advertisement
దీంతో టీం ఇండియా నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి చేరుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 272 పరుగుల స్కోర్ చేసింది. వీరిలో కెప్టెన్ హష్మతుల్లా షాహిది 88 బంతుల్లో 80, (8 ఫోర్లు, 1 సిక్స్) చేసి టాప్ స్కోరర్ అయ్యారు.
ఆ తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్ 69 బంతుల్లో 62 స్కోర్ తో అర్థ శతకం చేశారు. టీం ఇండియా బౌలర్లలో బుమ్రా 4 వికెట్లతో దుమ్ము దులిపేశాడు. దాంతో ఆ జట్టు ఓటమి పాలయ్యింది. అసలు నిన్నటి బుమ్రా పర్ఫార్మెన్స్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది ఏమో. మొదట కొత్త స్వింగ్ తో బాల్ రాబట్టాడు. 10 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో కూడా 10 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చాడు.
అప్పుడు రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ లో పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ మీద వికెట్లు తీసి వారిని పడగొట్టాడు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ లో బుమ్రా పాల్గొనలేకపోయాడు. దాంతో జట్టు బౌలింగ్ బలహీన పడిపోయింది. తర్వాత సెమీఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఘోర పరాజయం పాలయ్యింది. మొత్తం 80 వన్డే మ్యాచ్ లు ఆడిన బుమ్రా, వన్డేల్లో 135 వికెట్స్ తీశాడు. వన్డే క్రికెట్ లో బూమ్రా ఎకానమీ 4.65 గా నమోదు అయ్యింది.
మన టీం ఇండియాలో కోహ్లీ, రోహిత్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. వీళ్లిద్దరూ కూడా ఇప్పుడు ఫామ్ లో ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి కంటే కూడా బుమ్రాని చూసి ప్రత్యర్థి జట్లు భయపడిపోతున్నారట. ఫ్లాట్ పిచ్ మీద కూడా బుమ్రా తనదైన స్టైల్ లో అదరగొడుతున్నాడు. ఫస్ట్ ఓవర్లలో వికెట్లు తీస్తున్నాడు. చివరిలో పరుగులు పట్టిస్తున్నాడు. దాంతో టీం ఇండియా గెలవడానికి అసలైన కారణంగా మారాడు. బుమ్రా ఇదే స్పీడ్ తో తన ఆటని కంటిన్యూ చేస్తే టీం ఇండియాని ఆపడం ఆపోజిట్ టీమ్ వాళ్ళకి కష్టం అవుతుంది ఏమో.
End of Article