Ads
ప్రతి సంవత్సరం క్రికెట్ అభిమానులు ఎదురు చూసేది ఐపీఎల్ సీజన్ కోసమే. ఐపీఎల్ 2024 సీజన్ మొదలు అవుతోంది. దీని కోసం ఇవాళ వేలం కూడా జరుగుతోంది. దుబాయ్ లో ఈ వేలం జరుగుతోంది. ఈ మినీ వేలం కోసం 332 మంది ప్లేయర్లు రాబోతున్నారు.
Video Advertisement
అందులో 77 మంది ఆటగాళ్లని జట్లలోకి తీసుకుంటారు. ఇవాళ మధ్యాహ్నం ఈ వేలం మొదలు అయ్యింది. ఇందులో మొదటిగా ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ హ్యారీ బ్రూక్ ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నాలుగు కోట్ల రూపాయలకి కొనుగోలు చేసింది. 2 కోట్ల బేస్ ధరతో వచ్చిన హ్యారీ బ్రూక్ కోసం రాజస్థాన్ రాయల్స్ కూడా ప్రయత్నించింది.
కానీ చివరికి 4 కోట్లకి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సొంతం చేసుకుంది. కానీ ఇది నిరుత్సాహపరిచే విషయమే. ఎందుకంటే 2023 ఐపీఎల్ సీజన్ కోసం హ్యారీ బ్రూక్ ని సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టు 13.5 కోట్లని పెట్టి తీసుకుంది. కానీ ఈసారి మాత్రం సగానికి సగం పడిపోయి4 కోట్లకి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసింది. ఎన్నో భారీ అంచనాల మధ్య సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున ఆడిన హ్యారీ బ్రూక్ తన పేలవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచారు. 11 మ్యాచ్ లలో కేవలం 190 పరుగులు మాత్రమే చేసి, ఒక మ్యాచ్ లో మాత్రం సెంచరీ చేశారు.
కానీ మిగిలిన మ్యాచ్ లలో అంచనాలని అందుకోవడంలో విఫలం అయ్యారు. దీంతో హైదరాబాద్ జట్టు వేలం కోసం హ్యారీ బ్రూక్ ని విడుదల చేసింది. ఇప్పటివరకు ఇంగ్లాండ్ తరపున 27 అంతర్జాతీయ టి20 లు ఆడి, అందులో 531 రన్స్ చేశారు. 12 టెస్ట్ మ్యాచ్ లలో 1,181 రన్స్, 15 వన్డేల్లో 407 పరుగులు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఒకే సంవత్సరంలో దాదాపు 9 కోట్ల తేడాతో పడిపోవడం అనేది నిరాశపరిచే విషయమే కావడం గమనార్హం. మరి ఇప్పుడైనా ఎవరూ ఊహించని విధంగా ఆడి హ్యారీ బ్రూక్ మళ్లీ తన విలువని పెంచుకుంటారు ఏమో వేచి చూడాల్సిందే.
ALSO READ : రైతు బిడ్డని అభినందించిన మాజీ మంత్రి… ఏమన్నారంటే….!
End of Article