Ads
“ఐపీఎల్”.. ప్రతి క్రికెట్ ప్రేమికుడు ఎంతగానో ఎదురుచూసేది ఐపీఎల్ కోసమే… భారత ఆటగాళ్ల సత్తా రుజువయ్యేది ఈ ఐపీఎల్ తోనే.. అతిపెద్ద క్రికెట్ కుంభమేళా గా ఐపీఎల్ కు పేరుంది. ప్రపంచవ్యాప్తం గా పలువురు ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడటానికి మొగ్గుచూపుతుంటారు. ప్రస్తుతం ఐపీఎల్ హడావిడి మొదలైంది. గతేడాది ఆలస్యం గా జరిగింది. అది కూడా పరాయి గడ్డ అయినా యుఏఐ లో జరిగింది. ఈసారి మన దేశం లోనే జరుగుతున్నా టివీల్లోనే చూడాల్సి వస్తోంది.
Video Advertisement
ఇది ఇలా ఉంటె.. ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ కోసం ఇప్పటికే సెలెక్షన్స్ పూర్తి అయ్యాయి. గ్రౌండ్ లు ఖాళీ గా ఉన్నా ఆటగాళ్ల పంచ్ లలో పదును తగ్గేదే లేదు. గతేడాది ఐపీఎల్ లో కూడా మన ఆటగాళ్లు ఏ రేంజ్ లో సత్తా చాటారో చూసాం.. ఐతే.. ఎస్ ఆర్ హెచ్, చెన్నై సూపర్ కింగ్స్ తో సహా పలు జట్లకు కరోనా ఇబ్బందులతో పాటు పలు ఇక్కట్లు ఎదురయ్యాయి. అయినప్పటికీ.. సమర్థవంతం గా సత్తా చాటారు. గతేడాది ముంబై ఇండియన్స్ టైటిల్ గెల్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సారి కూడా టైటిల్ కోసం హోరా హోరీ గా పోరు జరగనుంది.
ఐతే, ఈ ఏడాది ఐపీఎల్ లో ఎస్ ఆర్ హెచ్ జట్టు లో మాత్రం కొన్ని లోపాలు కనపడుతున్నాయి. మరి వాటిని ఎస్ ఆర్ హెచ్ జట్టు ఎలా సమర్ధవంతం గా ఎదుర్కొంటుందో చూడాలి. ఇంతకీ ఆ లోపాలేంటో చూద్దాం.. ఎస్ ఆర్ హెచ్ లో సత్తా కలిగిన ఆటగాళ్లు ఉన్నప్పటికీ… బ్యాటింగ్ లో కొంత పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. ఎస్ ఆర్ హెచ్ కు అద్భుతంగా బ్యాటింగ్ చేయగల ఓపెనర్స్ ఉన్నారు. మూడు, నాలుగు స్థానాల్లో కూడా మంచి బ్యాట్స్ మెన్ ఉన్నారు. అయితే.. ఆ తరువాత స్థానాలు వచ్చేసరికి బ్యాటింగ్ లో కొంత వేగం తగ్గుతోంది.
ఎస్ ఆర్ హెచ్ జట్టు టాప్ ఆర్డర్ నుంచి బాగానే ఆడుతుంది. ఎక్కువగా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ పైనే జట్టు ఆధారపడి ఉంది. ఒకవేళ మొదట ఆడే ఆటగాళ్లు ఇన్నింగ్స్ చేయలేకపోతే ఇక జట్టు వెనకబడిపోతుంది. సరైన ఫినిషర్స్ లేకపోవడం ఈ జట్టుకు ఉన్న మరో డ్రా బ్యాక్.ఇంకొక సంగతి ఏమిటంటే.. ఎస్ ఆర్ హెచ్ లో ఓవర్సీస్ స్థానాల్లో ఆడటానికి డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్, కానే విలియమ్ సన్, జాసన్ రాయ్, జాసన్ హోల్డర్, జానీ బైర్ స్టో, మొహమ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్ లు ఉన్నారు. వీరిలో నలుగురు ఓవర్సీస్ ప్లేయర్స్ ను ఎంచుకోవాలంటే.. అది ఎస్ ఆర్ హెచ్ కు ఓ సవాలే. మరి వీటన్నిటిని అధిగమించి.. ఐపీఎల్ 2021 లో ఎస్ ఆర్ హెచ్ ఎలా సత్తా చాటుతుందో చూడాలి.
Also Read : “అదే చెన్నై కొంపముంచింది”…DC తో CSK మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇదే.!
End of Article