2023 లో టాప్ 10 “తెలుగు సీరియల్స్” ఇవే..! మొదటి స్థానంలో ఉన్న సీరియల్ ఏదంటే..?

2023 లో టాప్ 10 “తెలుగు సీరియల్స్” ఇవే..! మొదటి స్థానంలో ఉన్న సీరియల్ ఏదంటే..?

by kavitha

Ads

ఎన్ని చిత్రాలు, వెబ్ సిరీస్ లు వచ్చినా, ఓటీటీలు ఎన్ని వచ్చినా,  టెలివిజన్ లో ఎన్ని ప్రోగ్రామ్స్ వచ్చినా సీరియల్స్ స్థానాన్ని ఏది భర్తీ చేయలేదు. వాటి స్థానం ఎప్పుడూ పదిలమే. సీరియల్స్ కు ఉండే ఫాలోయింగ్ కొంచెం కూడా  తగ్గలేదు.

Video Advertisement

ఇంట్లో ఉండే మహిళలకు ఇప్పటికీ కూడా కాలక్షేపం అంటే సీరియల్స్. అందుకే వాటికి టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయి. ఈ రేటింగ్స్ వారం వారం మారుతూ ఉంటాయి. అయితే తెలుగు లో ప్రస్తుతం టీఆర్పీ రేటింగ్స్ విషయంలో టాప్ 10 లో ఉన్న సీరియల్స్ ఏవంటే.
1. బ్రహ్మ ముడి – స్టార్ మా :

స్టార్ మా ప్రసారం అవుతోన్న బ్రహ్మముడి సీరియల్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది.ప్రతి రోజు ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ‘కార్తీక దీపం’ స్థానంలో జనవరి 24 నుంచి ప్రసారం అవుతుంది. ఈ సీరియల్ కు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. ఈ సీరియల్ 12.76 టీఆర్పీ రేటింగ్ తో టాప్ ప్లేస్ లో ఉంది.2. నాగ పంచమి – స్టార్ మా:

నాగలోకపు రాణి చావుకు కారణమైన వ్యక్తి పై పగ తీర్చుకోవడానికి వచ్చిన నాగుల కథనే  ఈ సీరియల్. ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ 11.36 రేటింగ్ తో రెండవ స్థానంలో ఉంది.
3. కృష్ణ ముకుంద మురారి-స్టార్ మా:

స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ మంచి కథతో చాలా ఆసక్తికరంగా సాగుతొంది. ఈ సీరియల్ 11.32 రేటింగ్ తో మూడోస్థానంలో ఉంది.4. గుప్పెడంత మనసు – స్టార్ మా:

ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ గుప్పెడంత మనసు. కాలేజ్ లో లెక్చరర్ కు విద్యార్ధికి మధ్య కలిగే ప్రేమ పై సాగే  కథ. ఈ సీరియల్ 10.85 రేటింగ్ తో నాలుగవ స్థానంలో ఉంది.
5. మల్లీ నిండు జాబిలి – స్టార్ మా:

మల్లీ సీరియల్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న సీరియల్. ఈ సీరియల్ 10.32 రేటింగ్ తో ఐదవ స్థానంలో ఉంది.6. త్రినయని – జీ తెలుగు:

త్రినయని సీరియల్ మొదలయిన రోజు నుండి ఇప్పటి వరకూ ఇంట్రెస్టింగ్ సాగుతోంది. బెంగాలీలో విజయం సాధించిన సీరియల్ ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఈ సీరియల్ 7.64 రేటింగ్ తో ఆరవ స్థానంలో ఉంది.7. పడమటి సంధ్యారాగం – జీ తెలుగు:

పడమటి సంధ్యారాగం సీరియల్ మొదటి నుండి మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. మంచి ఫ్యామిలీ కథ కావటంతో ఆడియెన్స్  హృదయాన్ని తాకింది. ఈ సీరియల్ 7.27 రేటింగ్ తో ఏడో స్థానంలో ఉంది.
8. ప్రేమ ఎంత మధురం – జీ తెలుగు:

ప్రేమకు వయస్సుతో సంబంధం ఉండదని చెప్పే సీరియల్ ప్రేమ ఎంత మధురం.  ఈ సీరియల్ విజయవంతంగా నడుస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్ 7.02 రేటింగ్ తో ఎనిమిదవ స్థానంలో ఉంది.9. అమ్మాయి గారు – జీ తెలుగు:

జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం అవుతున్న ‘అమ్మాయి గారు’ సీరియల్‌లో ప్రధాన పాత్రలలో నిషా రవికృష్ణన్ మరియు యశ్వంత్ గౌడ నటిస్తున్నారు. తండ్రి కూతుర్ల మధ్య ప్రేమతో ముడిపడిన కథ. ఈ సీరియల్ 6.32 రేటింగ్ తో తొమ్మిదవ స్థానంలో ఉంది. 10. నువ్వు నేను ప్రేమ – స్టార్ మా:

ఒకరిని ఒకరు చూడడానికి కూడా అసహ్యించుకునే అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ ఎలా ప్రారంభం అవుతుంది. ఆ తరవాత వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేది ఈ సీరియల్‌ కథ. ఈ సీరియల్ 6.40 రేటింగ్ తో పదవ స్థానంలో ఉంది.
Also Read:ఈ జబర్దస్త్ నటుడు ఇపుడు ఏం చేస్తున్నారో తెలుసా?


End of Article

You may also like