“పాపం RCB ఫ్యాన్స్…ఫుల్ ఖుషీ SRH ఫ్యాన్స్…పృథ్వీ షా 200 “…ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్ల్స్.!

“పాపం RCB ఫ్యాన్స్…ఫుల్ ఖుషీ SRH ఫ్యాన్స్…పృథ్వీ షా 200 “…ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

గత ఐపీఎల్ లో నిరాశపరిచిన పృథ్వీ షా మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా పుదుచ్చేరి తో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ లో 142 బంతుల్లో డబుల్ సెంచరీ చేశారు. పృథ్వీ షా 152 బంతుల్లోనే 227 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో, ముంబై జట్టు 4 వికెట్ల నష్టానికి 457 పరుగుల స్కోర్ చేసింది. విజయ్ హజారే టోర్నీ చరిత్రలో టాప్ స్కోరర్ గా రికార్డు సాధించారు పృథ్వీ షా.

Video Advertisement

పృథ్వీ షా కి లిస్ట్ ఏ క్రికెట్ లో ఇదే మొదటి డబుల్ సెంచరీ. పృథ్వీ షా ఆటతీరుతో, ముంబై జట్టు కూడా విజయ్ హజారే టోర్నీలో గత వారం మధ్యప్రదేశ్‌ పై జార్ఖండ్ చేసిన 422/9 స్కోర్ అని అధిగమించి అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా రికార్డ్ సాధించింది. ఇంక ముంబై జట్టు విషయానికొస్తే ఆదిత్య తారే 56 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 58 బంతుల్లో 133 పరుగుల స్కోర్ చేశారు. సూర్య 22 ఫోర్లు, 4 సిక్సులు చేయగా, పృథ్వీ షా 5 సిక్సులు, 31 ఫోర్లు చేశారు. లిస్ట్ ఏ క్రికెట్ లో డబుల్ సెంచరీ స్కోర్ చేసిన నాలుగో ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేశారు పృథ్వీ షా.

అంతేకాకుండా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్ కూడా విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర తరపున ఆడి 101 పరుగుల స్కోర్ చేశారు. 108.60 స్ట్రైక్ రేట్ తో తన తన ఇన్నింగ్స్‌లో 4 సిక్సర్లు, 5 ఫోర్లు కొట్టారు. కేదార్ జాదవ్ ఇన్నింగ్స్ తో జట్టు స్కోర్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 277 కి చేరింది. ఈ సంవత్సరానికి ఐపిఎల్ ఆక్షన్ ఇటీవల జరిగింది. ఇందులో గ్లెన్ మాక్స్వెల్ ని 14.25 కోట్లకి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టులోకి తీసుకొచ్చుకున్నారు.

కానీ ప్రస్తుతం గ్లెన్ మాక్స్వెల్ ఫామ్ లో లేరు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో మాక్స్వెల్ ఆటతీరు నిరాశపరిచింది. పృథ్వీ షా గత ఐపీఎల్ సీజన్ లో తన పెర్ఫార్మెన్స్ తో నిరాశపరిచినందుకు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. కేదార్ జాదవ్ కూడా గత సంవత్సరం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడారు. తన పర్ఫార్మెన్స్ నిరాశపరచడంతో కేదార్ జాదవ్ ని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.

ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్నారు కేదార్ జాదవ్. కానీ ఇప్పుడు పృథ్వీ షా మళ్లీ ఫామ్ లోకి రావడంతో, కేదార్ జాదవ్ కూడా సెంచరీ చేయడంతో, అంతే కాకుండా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో గ్లెన్ మాక్స్వెల్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15

#16#17#18#19#20


End of Article

You may also like