మహిళల టీ20 వరల్డ్ కప్లో గురువారం ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు 5 పరుగుల తేడాతో టీమిండియా ని ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడినా.. పూర్తి ఫిట్ నెస్ లేకపోయినా ఈ మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ (34 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) పోరాటం వృధాగా నిలిచింది. జెమీమా రోడ్రిగ్స్ (24 బంతుల్లో43; 6 ఫోర్లు) రాణించినా టీమిండియా కి ఓటమి తప్పలేదు.
Video Advertisement
173 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధాన ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన యస్తిక భాటియా రనౌట్ అయ్యింది. ఈ దశలో జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ లు జట్టును నడిపించారు. వీరిద్దరూ ధాటిగా ఆడటం తో భారత్ స్కోరు బోర్డు పరుగెత్తింది. వీరిద్దరు 3వ వికెట్ కు 69 పరుగులు జోడించారు. అనంతరం అనవసరపు షాట్ కు వెళ్లి జెమీమా అవుటైంది. ఆ తర్వాత రిచా ఘోష్ తో కలిసి హర్మన్ జట్టును ముందుకు నడిపించింది. ఈ క్రమంలో హర్మన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది.
అయితే వీరిద్దరు క్రీజులో ఉండటంతో భారత్ గెలిచేలా కనిపించింది. కానీ దురదృష్టం హర్మన్ ను వెంటాడింది. రెండో రన్ కోసం హర్మన్ ప్రయత్నించినా సమయంలో పిచ్ లో బ్యాట్ ఇరుక్కుపోవడంతో రనౌట్ అయ్యింది. కాసేపటికే రిచా ఘోష్ కూడా పెవిలియన్ కు చేరింది. ఆఖర్లో దీప్తి శర్మ పోరాడినా టీమిండియాకు ఓటమి తప్పలేదు. అయితే కీలక సమయంలో కెప్టెన్ రనౌట్ కావడం భారత్‌కు విజయాన్ని దూరం చేసింది.
అయితే గతం లో 2019 పురుషుల వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లోనూ భారత్ ఇలాగే ఓటమిపాలైంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో ముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. భారత్ విజయానికి 10 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో మార్టిన్ గుప్టిల్ డైరెక్ట్ త్రో ద్వారా ధోనీ (72 బంతుల్లో 50)ను రనౌట్ చేశాడు. దీంతో మ్యాచ్ కివీస్ నెగ్గింది. అయితే ఇప్పుడు హర్మన్ జెర్సీ నెంబర్ 7 , అలాగే ఆమె కెప్టెన్ గా ఉండటం తో ఈ రెండు ఒకేలా జరిగాయని భారత్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు.
తొలిసారి టీ20 వరల్డ్ కప్ గెలవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన భారత అమ్మాయిలు.. సెమీస్‌లో ఓటమితో ఇంటికి చేరుకున్నారు. అయితే తాజాగా జరిగిన మ్యాచ్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12